India’s Oldest Tiger Died: తనదైన వాడి పంజాతో వేటాడిన ఆ పెద్ద పులి ఇక లేదు. దేశంలో సుదీర్ఘ కాలం జీవించి రికార్డు సాధించిన పెద్ద పులి (రాజా) కన్నుమూసింది. 25 ఏళ్ల కంటే ఎక్కువే బతికిన రాజా.. సోమవారం వేకువజామున ఎస్‌కేబీ (సౌత్ ఖైర్‌బరి) రెస్క్యూ సెంటర్‌లో కన్నుమూసినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు.
అనుకోలేదు
2008వ సంవత్సరంలో సుందర్‌బన్‌లోని మాట్లా నదిని దాటుతుండగా మొసలి దాడి చేయడంతో రాజాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 2008వ సంవత్సరం నుంచి సౌత్ ఖైర్‌బారి టైగర్ రెస్క్యూ సెంటరులోనే పులిని ఉంచారు. మొసలి దాడి నుంచి బయటపడిన తర్వాత కృత్రిమ అవయవాలపై ఈ పులి నడిచిందని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ దేబాల్ రాయ్ చెప్పారు.
అయితే అన్ని గాయాలు కావడంతో ఇది బతుకుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 15 ఏళ్లకుపైగా ఇది జీవించింది.
మిస్ యూ రాజా
రాజా మృతిపై అక్కడి నిర్వాహకులతో పాటు పలువురు సోషల్ మీడియాలో ' వీ మిస్ యూ రాజా' అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు. అటవీశాఖ ఉద్యోగులు పులి కళేబరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. గత ఏడాది ఆగస్టు 23న ఈ పులి పుట్టిన రోజు వేడుకలను అటవీశాఖ అధికారులు వైభవంగా జరిపారు.
ఆ రికార్డ్
25 సంవత్సరాల 10 నెలల వయసులో మరణించిన 'రాజా' రాయల్ బెంగాల్ టైగర్‌లోనూ అతి పెద్దది.పెద్ద పులులు సాధారణంగా 20 ఏళ్లకు మించి జీవించవని, కానీ ఇది 25 ఏళ్లకు పైగా జీవించిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.
Also Read: Viral Video: 'షూ' వేసుకునే ముందు ఒకసారి చెక్ చెయ్ బ్రో- ఇలా పాముంటే అంతే సంగతి!
Also Read: Russian Citizenship to Ukrainians: పుతిన్ మరో సంచలనం- ఇక ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం!