Bike Pillion Riders: పురుషులు ద్విచక్ర వాహనం వెనుక సీట్లో కూర్చోవద్దంటూ కర్ణాటకలోని మంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గంటలోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. అయితే అసలు ఎందుకు నిషేధం విధించారు, ఎందుకు ఉపసంహరించుకున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం. 


18 నుంచి 60 ఏళ్ల వారికి నిషేధాజ్ఞలు..


అయితే పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు హత్య కావడం దక్షిణ కన్నడ జిల్లాలో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. దాన్నే ఆగస్టు 8వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నగరంలో.. ద్విచక్రవాహనం వెనుక సీట్లో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల పురుషులు ఎవరూ కూర్చోవడానికి వీళ్లేదని చెప్పారు. మైనర్లు, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ స్పష్టం చేశారు.   


నగరంలో మొత్తం 19 చెక్ పోస్టుల ఏర్పాటు..


ఇందుకోసం ప్రత్యేకంగా నగరంలో 19 చేక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాత్రిపూట అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 200 వాహనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని ఆంక్షలను కూడా విధించారు. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు చేయం, ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఆందోళనలకు దిగడం, ఫొటోలు, పోస్టర్లు ప్రదర్శించడాన్ని నిషేధించారు. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేశారు. ఆయుధాలు పట్టుకొని తిరగడం, టపాసులు పేల్చడం, దిష్టి బొమ్మలు దహనం చేయడంపై కూడా నిషేధం విధించారు. ఆగస్టు 8వ తేదీ వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కానీ గంటలోనే మంగళూరు పోలీసులు గంటలోపే వెనక్కి తగ్గడం చర్చనీయాంశమైంది.


ముగ్గురి మృతితో మంగళూరులో గొడవలు.. 


అయితే గత రెండు వారాల్లోనే మంగళూరులో మూడు హత్యలు జరిగాయి. జులై 19వ తేదీన 18 ఏళ్ల కేరళ యువకుడు బి.మసూద్ ను బెల్లారే సమీపంలో చంపేశారు. రెండ్రోజుల తర్వాత అంటే జులై 26న బీజేపీ విభాగం నేత 32 ఏళ్ల ప్రవీణ్ నెట్టూరును కొందరు అతి కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా దుమారం రేపింది. ఆ తర్వాత సూరత్ కల్ లోని ఓ బట్టల దుకాణంలో 23 ఏళ్ల  మహమ్మద్ ఫాజిల్ ని హత్య చేశారు. వీరి మృతిపై హిందుత్వ సంఘాల ప్రతినిధులు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఆంక్షలు విధించారు. ,


Also Read: Lorry Accident: మహిళల పైనుంచి దూసుకెళ్లిన లారీ, మాంసపు ముద్దలా మారిన శరీరాలు!


Also Read: Police Overaction: రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ - చలాన్లు పెండింగ్, బైకర్‌పై చేయి చేసుకున్న కూకట్ పల్లి ట్రాఫిక్ సీఐ