Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయంలో అసలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది భాజపా. మహారాష్ట్ర కొత్త సీఎం దేవేంద్ర ఫడణవీస్ అని అందరూ అనుకుంటున్న వేళ ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఈ విషయం సహా ఇన్ని రోజులు జరిగిన పరిణామాలపై ఏక్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నమ్మకం పోనివ్వను
50 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది. ఇందులో 40 మంది శివసేనకు చెందినవాళ్లే. వారి సాయంతోనే ఈ యుద్ధం చేయగలిగాను. 50 మంది ఎమ్మెల్యేలు నాపై పెట్టుకున్న నమ్మకానికి చిన్న మరక కూడా పడనివ్వను. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దగ్గరకు మా నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి గురించి చర్చించేందుకు వెళ్లాం. కానీ మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. పరిస్థితులు ఇలానే కొనసాగితే తర్వాతి ఎన్నికల్లో మేం గెలవలేం అనే స్థితికి మా ఆలోచనలు వచ్చాయి. అందుకే భాజపాతో సహజమైన పొత్తు పెట్టుకోవాలని ఠాక్రేను ఎన్నోసార్లు కోరాం. కానీ ఆయన మా మాట పట్టించుకోలేదు. బాల్ ఠాక్రే హిందుత్వ అజెండాను, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. - ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత
అందరికీ కృతజ్ఞతలు
120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా దేవేంద్ర ఫడణవీస్ సీఎం పదవిని వదులుకున్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర భాజపా నేతలకు నా కృతజ్ఞతలు. బాలా సాహెబ్ సైనికుడ్ని మీరంతా సీఎంను చేశారు.- ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత
Also Read: Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం
Also Read: UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన