LS RS Unparliamentary Words: జులై 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతోన్న వేళ లోక్‌సభ సెక్రటేరియెట్ తాజాగా ఓ కొత్త బుక్‌లెట్ విడుదల చేసింది. ఇక నుంచి లోక్‌సభ, రాజ్యసభలలో బుక్‌లెట్‌లోని పదాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. అయితే తాజా జాబితాలో 'సిగ్గుచేటు, అవినీతిపరుడు' వంటి సాధారణంగా వాడే పదాలను చేర్చడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
వీటిపై నిషేధం
- మొసలి కన్నీళ్లు
- గాడిద
- అసమర్థుడు
- గూండాలు
- అహంకారి
- చీకటి రోజులు
- జుమ్లాజీవి
- కొవిడ్ స్ప్రెడర్
- స్నూప్ గేట్
- సిగ్గు చేటు
- మోసగించడం
- అవినీతిపరుడు
- డ్రామా
- హిపోక్రసీ
- నియంత
- శకుని
- తానాషా
- ఖలిస్థానీ
- ద్రోహ చరిత్ర
- చంచా
- చంచాగిరి
- పిరికివాడు
- క్రిమినల్
ఇలాంటి పలు పదాలపై నిషేధం విధించారు. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉన్న పదాలను సభ్యులు ఉపయోగిస్తే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు.
విపక్షాల మాట
సాధారణంగా వినియోగించే పదాలను కూడా నిషేధిత జాబితాలోకి చేర్చినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. సభలో ఇలాంటి పదాలు వాడటం తప్పదని టీఎంసీ ఎంపీలు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాడతామని అవసరమైతే సస్పెండ్ చేసుకోవాలని సవాల్ విసిరారు.
Also Read: CM Stalin Hospitalized: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్- రెండు రోజుల క్రితం కరోనా!
Also Read: Viral Video: 'నా ముందు వరదైనా సరే- సలాం కొట్టి సైడ్ అవ్వాల్సిందే'- గంగానదిలో గజరాజు సాహసం!