Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్ర ఘటన జరిగింది. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటూ వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహిళలు ఎమ్మెల్యే, నగర్ పాలికా చైర్మన్లపై బురద చల్లారు. ఎమ్మెల్యే కూడా ఇంకా పోయండి అంటూ అడిగి మరి బురద జల్లించుకున్నారు.
ఇదీ జరిగింది
మహారాజ్‌గంజ్‌లోని పిపర్‌డ్యూరా గ్రామానికి చెందిన మహిళలు వర్షాలు కురవాలని కోరుకుంటూ వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేశారు. భాజపా ఎమ్మెల్యే జైమంగల్ కనోజియా, నగర్ పాలికా చైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురదతో స్నానం చేయిస్తూ పాటలు పాడారు. బురద స్నానం చేయడం వల్ల ఈ ప్రాంతానికి వర్షం కురిపించే వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని ఈ ప్రాంతవాసుల నమ్ముతారు.
నమ్మకం
నగర అధిపతికి బురద స్నానం చేస్తే వరుణుడు సంతోషిస్తాడని మహిళలు చెప్పారు. వరుణ దేవుడిని సంతోషపెట్టడానికి పిల్లలు బురదలో స్నానం చేస్తారని స్థానికంగా దీనిని కల్ కలూటి అని పిలుస్తారని వారు చెప్పారు.
దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే యూపీలోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదంటూ మహిళలు ఇలా ప్రార్థనలు చేశారు.
Also Read: Covid Update: దేశంలో ఒక్కరోజులో 20 వేల కేసులు- 145 రోజుల తర్వాత తొలిసారి
Also Read: Zika virus: ఏడేళ్ల బాలికకు పాజిటివ్- దేశంలో మరోసారి జికా వైరస్ టెన్షన్!