Covid Update: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. తాజాగా 16,482 మంది కరోనా నుంచి కోలుకున్నారు.






రికవరీ రేటు 98.49 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.31 శాతానికి చేరింది. 145 రోజుల తర్వాత కేసులు 20వేల మార్కును దాటాయి. 



  • డైలీ పాజిటివిటీ రేటు: 5.1 శాతం

  • యాక్టివ్​ కేసులు: 1,36,076

  • మొత్తం మరణాలు: 5,25,557

  • మొత్తం రికవరీలు: 4,30,28,356


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 13,44,714 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,27,27,559కి చేరింది. మరో 3,94,774 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Zika virus: ఏడేళ్ల బాలికకు పాజిటివ్- దేశంలో మరోసారి జికా వైరస్ టెన్షన్!


Also Read: Solapur BJP Leader : ఆమె రమ్మందని రూమ్‌కెళ్లిపోయాడట బీజేపీ నేత - తర్వాత అసలు సినిమా జరుగుతోంది !