Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో తుది విడత పోలింగ్ ప్రారంభం- 57 స్థానాల్లో జరుగుతున్న ఓటింగ్
Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా ఇవాళ చివరి విడత పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. నేడు 57 స్థానాల అభ్యర్థులను ఓటర్లు డిసైడ్ చేయనున్నారు. ఇక్కడ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్.
యూపీ సీఎం ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
భారత మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... "ఈ రోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేసి మీ కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను." అని అన్నారు.
పంజాబ్‌లోని మొహాలీ పోలింగ్ బూత్‌లో ఆడపిల్లలు గిద్దా నృత్యం చేశారు. అర్హత ఉన్న వారంతా ఓటు వేయలని అవగాహన కల్పించారు. పంజాబ్‌లోని 13 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తన ఓటును గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ పోలింగ్‌లో బూతులో వేశారు.
Background
Lok Sabha election phase 7: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు వచ్చింది. ఇవాళ్టితో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 486 ఎంపీ స్థానాలకు ఆరు దశల్లో పోలింగ్ జరిగింది. ఇవాళ చివరిదైన ఏడో దశ పోలింగ్ ప్రారంభమైంది.
చివరి దశ పోలింగ్‌లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఆయనతోపాటు 57 నియోజకవర్గాల్లో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పంజాబ్, చండీగడ్‌లో జరగుతుంది. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఆరు లోక్‌సభ స్థానాలు ఉంటే 42 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19న ప్రారంభమైంది. జూన్1తో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. లెక్కింపు జన్ నాలుగున జరగనుంది. ఈ సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆరు దశల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 486 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. చివరి విడత ఎన్నికల్లో 10 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో పురుషులు 5.24 కోట్ల మంది ఉంటే స్త్రీలు 4.82 కోట్ల మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3574 మంది ఉన్నారు.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో 13 స్థానాలకు, పంజాబ్‌లో 13 స్థానాలు, పశ్చిమబెంగాలవ్‌లో 9స్థానాలకు, జార్ఖండ్,ఒడిశాలో ఆరేసి స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు, బిహార్, చండీగఢ్‌లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
బరిలో ఉన్న వీఐపీలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఎంపీగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఆయనపై అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. రేసుగుర్రంలో విలన్‌గా నటించిన రవికిషన్ బీజేపీ అభ్యర్థిగా గోరఖ్ పూర్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పటికే అక్కడి నుంచి ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. టీఎంసీలో కీలక నేత అయిన అభిషేక్ బెనర్జీ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ ఎంపీ స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్‌లోని పాటలీపుత్ర ఎంపీగా ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి బరిలో నిల్చున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -