Maoists Died In Chattisgarh Encounter: తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్ (Chattisgarh) నారాయణ్‌పుర్ జిల్లాలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్, దంతెవాడ, జగదల్‌పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉమ్మడి భద్రతా దళాల బృందం, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. పోలీసులు బేస్ క్యాంప్ చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.


కాగా, నవంబర్ 30న ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక - ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. 2 ఏకే 47 తుపాకులతో పాటు మరో 5 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఆరుగురు ఛత్తీస్‌గఢ్ చెందిన వారు ఉన్నారు.


Also Read: Odisha Minor Rape Case: రేప్‌ చేశాడు, జైలుకెళ్లాడు, బెయిల్‌పై వచ్చి బాధితురాలని చంపేశాడు- శిక్షణ నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం