Odisha Minor Rape Case: బాలికలు(Girls), మహిళల(Women)పై దారుణాలను అరికట్టేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు కేంద్ర(Central), రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కామాంధులకు అడ్డుకట్ట పడడం లేదు. పోక్సో(POCSO) వంటి బలమైన చట్టాలు ఉన్నా.. మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించలేక పోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఒడిశాలో వెలుగు చూసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని నివ్వెర పరిచేలా చేసింది. ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. ఈ కేసులో జైలు(Prison)కు వెళ్లాడు. లైంగిక నేరాల(Atrocities) నుంచి పిల్లలు, మహిళలకు రక్షణ కల్పించే(POCSO) చట్టం కింద కేసు నమోదైంది. ఇది రుజువైతే.. జీవితాంతం జైలు లేదా మరణ శిక్ష తప్పదని గ్రహించిన నిందితుడు మరోదారుణానికి ఒడిగట్టాడు. బెయిల్ పై బయటకు వచ్చి సదరు బాధిత బాలికను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని తునాతునకలు చేసి.. చెల్లాచెదురుగా పలు ప్రాంతాల్లో పడేశాడు. అయితే.. పోలీసులు ఈ కేసును ఛేదించి.. నిందితుడిని అరెస్టు చేశారు.
అసలు ఏం జరిగింది?
ఒడిశా(Odisha)లోని సుందర్‌గఢ్(Sundargarh) జిల్లాలోని జార్సుగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై కామాంధుడైన యువకుడు కును కిసాన్(Kunu Kisan).. కొన్నాళ్ల కిందట అత్యాచారం చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో నేరం రుజువైతే.. జీవితాంతం జైలు లేదా మరణ శిక్ష తప్పదని గ్రహించిన కును.. పక్కా ప్లాన్‌తో బెయిల్‌పై బయటకు వచ్చాడు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంటనే సదరు బాధిత బాలికను మరోసారి ట్రాప్ చేసి.. జార్సుగూడ(Jhasu Guda) నుంచి అపహరించి రూర్కెలాకు తీసుకువచ్చాడు. అనంతరం.. అక్కడే ఆమెను దారుణంగా హత్య చేసి.. శరీర భాగాలను సైతం ఛిద్రం చేశాడు. వాటిని ఎవరూ గుర్తు పట్టకుండా.. సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడేశాడు. ఆ తర్వాత.. తాను యథా ప్రకారం... సుందర్‌గఢ్‌కు చేరుకుని.. ఏమీ తెలియనట్టే వ్యవహరించాడు.
అమ్మాయి కనిపించకపోవడంతో..
తమ చిన్నారి కనిపించక పోవడంతో ఆమె(Girl) తల్లిదండ్రులు జార్సుగూడ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేయాలని అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫొటోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. సమీప పోలీసు స్టేషన్లకు కూడా సమాచారం అందించారు. దీనికి తోడు సీసీటీవీ(CCTV) ఫుటేజీలో నిందితుడితో బాలిక ఉన్న దృశ్యాలు కూడా కనిపించాయి. దీంతో అత్యాచార నిందితుడు కును కిసాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. తొలుత తనకు ఏ పాపం తెలియదని చెప్పిన కును.. తర్వాత.. నిజం ఒప్పుకొన్నాడు. బాలికను హత్య చేసినట్టు చెప్పాడు.
అయితే.. ఈ క్రమంలో పోలీసులను దారి మళ్లించాడు. తొలుత బ్రాహ్మణి నదిలో విసిరేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి వెతికించారు. కానీ, ఎక్కడా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. దీంతో మరోసారి తమదైన శైలిలో నిందితుడిని విచారించగా.. అప్పుడు అసలు నిజాలు వెల్లడించాడు.
శిక్షకు భయపడి!
అత్యాచారం కేసుకు సంబంధించి తనపై నమోదైన పోక్సో కేసుకు భయ పడినట్టు కును కిసాన్ పోలీసుల(Police)కు వెల్లడించాడు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోతే.. తాను కేసు నుంచి సురక్షితంగా బయట పడే అవకాశం ఉంటుందని భావించి.. బాలికను హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ క్రమంలో బాలిక శరీర భాగాలను ఛిద్రం చేసి.. పలు చోట్ల విసిరేసినట్టు తెలిపాడు. దీంతో ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF), పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: విశాఖలో మహిళకు లైంగిక వేధింపులు, సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు
బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద శిక్ష పడకుండా ఉండేందుకు నిందితుడు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూర్కెలాలో హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కోసి దాచేందుకు ప్రయత్నించాడని, కానీ, సాధ్యం కాకపోవడంతో పలు చోట్ల విసిరేశాడని తెలిపాడు. కాగా.. క్రైమ్ సీన్‌ను రీక్రియేట్ చేయడానికి, పోలీసులు నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి మొత్తం సంఘటనను పునర్నిర్మించామని పశ్చిమ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్(IG) ఆఫ్ పోలీస్ హిమాన్షు లాల్(Himanshu Lal) తెలిపారు. బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని త్వరితగతిన విచారణ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని వివరించారు.
ఢిల్లీ కూడా జరిగింది!
ఇలాంటి ఘటనే ఢిల్లీలో కూడా.. ఏడాదిన్నర కిందట జరిగిన విషయం తెలిసిందే. సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న వ్యక్తి.. ఆమెను దారుణంగా హత్య చేసి.. శరీర భాగాలను సమీప అడవిలో విసిరేశాడు. ఈ క్రమంలో వారం రోజుల పాటు శరీర భాగాలను ఇంట్లోని ఫ్రిజ్‌లోనే నిల్వ చేసినట్టు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఒడిశాలో వెలుగు చూసిన ఘటన మరింత నివ్వెర పోయేలా చేస్తుండడం గమనార్హం.
Also Read: బ్రెయిన్ ట్యూమర్ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం