YS Jagan Saraswati Power Land In Palnadu district: వివాదాలకు కేంద్రంగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్(saraswati power & industries pvt ltd) వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీకి ఇచ్చిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. మాచవరం (Machavaram)మండలం వేమవరం(Vemavaram)లో 13.80 ఎకరాలు, పిన్నెల్లి(Pinnelli)లో 3.89 ఎకరాలను స్వాధీనానికి తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు.
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం జరిగినప్పుడు సరస్వతి పవర్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. అసలు అక్కడ ప్రభుత్వం భూములు తీసుకొని ఎలాంటి పరిశ్రమ పెట్టకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీనికి తోడు స్థానిక ప్రజలు కూడా తమ భూములను లాక్కొని ఎలాంటి ఉపాధి కల్పించలేదని ఫిర్యాదులు చేశారు. అన్నింటి కంటే ముఖ్యంగా అ పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయని అనుమానం వచ్చింది.
ఇన్ని వివాదాలతో ముడి పడి ఉన్న సరస్వతి పవర్ భూముల వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని భావించింది ప్రభుత్వం. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ భూములను పరిశీలించారు. వేమవరం వద్ద ఉన్న భూముల్ని పరిశీలించిన స్థానికులతో మాట్లాడారు. భూముల ఇవ్వబోమని చెప్పిన తర్వాత కూడా రైతులను బెదిరించి లాక్కున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. లాక్కొని ఇన్నేళ్లు అవుతున్నా పరిహారం ఇవ్వకపోవడంపై కూడా ఫిర్యాదులు వచ్చినట్టు పవన్ తెలిపారు.
Also Read: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భూముల్ని లాక్కున్నారని పవన్ ఆరోపించారు. అటవీ భూమల్ని, అసైన్డ్ భూముల్ని కూడా కబ్జా చేశారని అన్నారు. చెరువు కుంటల భూమి కూడా ఉందని పవన్ ప్రకటించారు. ఫ్యాక్టరీ రాలేదు.. భూములలిచ్చిన ప్రజలకు ఉద్యోగాలు కూడా రాకపోయినా సొంత ఆస్తిలా అన్నాచెల్లెళ్లు కొట్టకుంటున్నారని పవన్ మండిపడ్డారు.
ఈ విషయంలో ప్రభుత్వం మెతకగా ఉండబోదని.. కఠినంగా ఉంటామని హెచ్చరించారు పవన్. అన్నట్టుగానే కొన్ని రోజుల తర్వాత ఆ భూముల్లో అధికారుల బృందం సర్వే చేపట్టింది. అణువణువూ కొలతలు వేసింది. సేకరించిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన తహశీల్దార్ 17.69 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటిఫికేషన్ జారీ చేశారు.
Also Read: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!