AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?

Inter Exams: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

Continues below advertisement

AP Inter Exams Time Table 2025: ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ఇంటర్మీడియట్ బోర్డు డిసెంబరు 11న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2025 మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 13తో ముగియనున్నాయి. అదేవిధంగా మార్చి 3 నుంచి మార్చి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 15తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 20తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

Continues below advertisement

ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు ప్రకటించింది. జనరల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు, ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.  

ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 1- శనివారం -  సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 4 - మంగళవారం - ఇంగ్లిష్ పేపర్-1

➥ మార్చి 6 - గురువారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.

➥ మార్చి 8 - శనివారం - మ్యాథ్స్ పేపర్‌-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1

➥ మార్చి 11 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1

➥ మార్చి 13 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1

➥ మార్చి 17 - సోమవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 19 - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

➥ మార్చి 3 - సోమవారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2

➥ మార్చి 5 - బుధవారం - ఇంగ్లిష్‌ పేపర్-2

➥ మార్చి 7 - శుక్రవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ-2, సివిక్స్-2.

➥ మార్చి 10 -  సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.

➥ మార్చి 12 - బుధవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.

➥ మార్చి 15 - శనివారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2

➥ మార్చి 18 - మంగళవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).

➥ మార్చి 20  - గురువారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2

➥ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామినేషన్: 01.02.2025 (శనివారం). 
సమయం: ఉ.10.00 గం. - మ.1.00 గం.

➥ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్: 03.02.2025 (మంగళవారం). 
సమయం: ఉ.10.00 గం. - మ.1.00 గం.

ప్రాక్టికల్ పరీక్షలు..

* జనరల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు. 

* ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు.

సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.  

 

Also ReadAP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే

Continues below advertisement