Ayyappa Deeksha : భారతదేశం వివిధ మతాల సమ్మేళనం. కొన్ని చోట్ల మతం పేరుతో కొందరిని కొట్టి చంపుతుంటే, మరికొన్ని చోట్ల మత సహనానికి ప్రతీకలుగా నిలిచే వారు ఎందరో ఉన్నారు. మత సహనం మన భారతీయుల సొత్తు అని చెబుతుంటాం. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంపెల్లిలోని  ఓ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని క్లాస్ రూంకి అనుమతించకుండా ఇంటికి పంపింది ఓ స్కూల్ యాజమాన్యం. అ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. స్కూలు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.


కొంపెల్లిలో ఘటన
అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు ఓ విద్యార్థిని క్లాసులోకి అనుమతించలేదు. ఈ ఘటన కొంపెల్లిలో చోటు చేసుకుంది. అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వచ్చిన విద్యార్థిని యాజమాన్యం తరగతి గదికి అనుమతించలేదు.  ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్‌లో అయ్యప్ప మాల వేసుకున్నాడని ఆ విద్యార్థిని ఇంటికి పంపింది. దీంతో స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని స్కూల్ లోపలికి అనుమతించకుండా  బయటే ఆపివేశారు. ప్రిన్సిపాల్ తీరు నిరసిస్తూ ఈ విద్యార్థి తండ్రి ఆందోళన చేపట్టారు.  మాల ధరిస్తే స్కూల్‌ లోపలికి ఎందుకు అనుమతించరంటూ విద్యార్థి తండ్రి మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ఇది సరైన పద్దతి కాదని, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి మాల వేసుకున్న పిల్లలను ఇలా ఇంటికి పంపేయడం ఎంత వరకు న్యాయమని మండిపడ్డారు.


Also Read : Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట






ఎలా అడ్డుకుంటారు
విద్యార్థిని క్లాస్ రూం లోపలికి అనుమతించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలి కానీ ఇలా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తండ్రి డిమాండ్ చేశారు.  స్కూల్ యాజమాన్యం ఇలా ప్రవర్తిస్తే పిల్లలపై మత ప్రభావాలు పడే అవకాశాలు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కుమారుడిని క్లాస్ రూంలోకి యాజమాన్యం అనుమతించాలని చెబుతున్నారు.  



గతంలో కూడా ఇలాగే..
గతంలో కూడా అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్ ​విద్యార్థిని సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూలు ప్రిన్సిపాల్ లోనికి రావద్దని అడ్డుకున్నాడు. మాల తీసే వరకు స్కూలుకి రావద్దని వెనక్కి పంపించేశాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపారు. విద్యార్థి తల్లి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసింది.  ఆ సమయంలో కూడా అయ్యప్పస్వామి భక్తులు, బీజేపీ నేతలు స్కూలు యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఇలాంటివి రిపీట్ ​అయితే సహించేది లేదంటూ హెచ్చరించారు.   


Also Read : Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు