Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Bhogapuram Airport News | శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి వెనుక ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Continues below advertisement

Rammohan Naidu Launches Airport Predictive Operations Centre at Hyderabad Airport | హైదరాబాద్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తుందని, మరో పదేళ్లలో దేశంలో 50 ఎయిర్ పోర్టులు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. 2026 జూన్ నాటిక భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్‌‌లోని నోవాటెల్‌లో బుధవారం జరిగిన ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. 

Continues below advertisement

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెనుక చంద్రబాబు కృషి

తెలంగాణలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి వెనుక ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) కృషి ఉందన్నారు రామ్మోహన్‌ నాయుడు. దాదాపు రెండు దశాబ్దాల కిందట 5 వేల ఎకరాల భూసేకరణ అంటే మామూలు విషయం కాదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులపై ఫోకస్ చేస్తోందన్నారు. అయితే ఇందుకు చంద్రబాబు ప్లానింగే కారణం అన్నారు. ఇంకా చెప్పాలంలే దేశంలోని ఐటీ విప్లవం (IT Revolution) వెనక టీడీపీ అధినేత చంద్రబాబు కృషి ఉందన్నారు. ఐటీ ద్వారా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నమ్ముతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు చంద్రబాబు ఆలోచనే 

రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘దేశంలో విమానాశ్రయాల నిర్వహణలో బెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం. తాజాగా ఏఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించాను. దేశ వ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో డిజియాత్ర టెక్నాలజీ (Digiyatra Technology) వినియోగిస్తున్నాం. ఎయిర్‌పోర్టులు అంటే కేవలం రవాణా సౌకర్యం కాదు. అది ఎందరికో ఉపాధి సైతం కల్పిస్తున్నాయి. ఎయిర్‌పోర్టులో డేటా అనలటిక్స్‌ వినియోగించి మరింత మెరుగ్గా సేవలు అందిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో విమానయాన మంత్రిత్వ శాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలో మార్పులు, టెక్నాలజీ వినియోగం కారణంగా ప్రపంచ దేశాలు భారత్ వెైపు చూస్తున్నాయి. తెలంగాణలో వరంగల్ విమానాశ్రయంతో పాటు, ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం.  2026 జూన్ కల్లా భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తాం. విమానాశ్రయంలో ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించడం ఒక మైలు రాయి’ అని అన్నారు.

Also Read: Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు ! 

GMR విమానాశ్రయాల సౌత్ అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్‌జీకే కిషోర్ ఈ ఫీచర్ గురించి మాట్లాడుతూ.. మా కొత్త AI-ఎనేబుల్డ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ (APOC) పనులను ఆధునీకరించడంలో, ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందిస్తుంది. రియల్ టైమ్ డేటా విశ్లేషణ, ప్యాసింజర్స్ వెయిటింగ్ టైమ్ తగ్గించనున్నాం. మెరుగైన భద్రతా సేవలు లభిస్తాయి. భారత్‌లో 73 శాతం ఈ-కామర్స్, టెక్ స్టార్టప్‌లు AI, వెబ్ 3.0 అప్లికేషన్‌ల ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారని నివేదిక వచ్చిందని తెలిపారు.

Also Read: Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు

Continues below advertisement