Manchu Manoj: మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడినట్లుగాకనిపిస్తోంది. మంచు మనోజ్ మొత్తం విషయాలు బయటపెడతానని ప్రకటించారు.కానీ అనూహ్యంగా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇవాళ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఇక తాను ఏం మాట్లాడేది లేదని ఆయన సిగ్నల్ ఇచ్చారు. పూర్తిగా దారి తప్పిన వ్యవహారంలో అసలేం జరిగింది ?
ఇక అంతర్గతంగా చర్చించుకోవాలనుకుంటున్నారా ?
మోహన్ బాబు కుటుంంబంలో పంచాయతీకి తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఇలా పెంచుకుంటే అది పెరిగిపోతూనే ఉంటుందని.. కుటుంబ వ్యవహారాలను బిగ్ బాస్ షోలా మీడియా, సోషల్ మీడియా ప్రజల ముందు ఉంచుతుందని విష్ణు ఆవేదనగా ఉన్నారు. వీలైనంత త్వరగా కట్ చేసుకుంటే మంచిదని మోహన్ బాబుకు సన్నిహితులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై బయట జరిగే ప్రచారాలకు అంతం ఉండదని అంటున్నారు. దీంతో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
Also Read: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
మనోజ్‌కు తల్లి, సోదరి సపోర్టు ఉండటంతో తగ్గిన మోహన్ బాబు, విష్ణు ?
మనోజ్ కుటుంబంలో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు కూడాఉందని చెబుతున్నారు. తల్లి ఇప్పటి వరకూ బయటకు రాలేదు కానీ.. మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి తల్లే కారణమని ప్రచారం జరుగుతోంది. మనోజ్, మౌనిక బిడ్డ ఆమె దగ్గరే ఉన్నారు. మనోజ్ ను బయటకు పంపేయడానికి కుటుంబంతో సంబంధం లేదని చెప్పడానికి తల్లి అంగీకరించే అవకాశం లేదని క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలని అనుకున్నప్పటికీ.. టెస్టుల తర్వాత ఇంటికి వచ్చేశాయని మనోజ్ బిడ్డ కోసమేనని .. అందుకే ఇప్పుడు మనోజ్ విషయంలో చర్చలు జరపాలని విష్ణు, మోహన్ బాబు సిద్దమయ్యారని అంటున్నారు.
ఆస్తులు అక్కర్లేదంటున్న మనోజ్ !
ఆస్తుల వివాదం కాదని మనోజ్ అంటున్నారు. విష్ణు తన తండ్రి మాట జవదాటనని అంటున్నారు. ఆయనఆస్తులు ఆయనిష్టం అంటున్నారు. అసలు సమస్య ఏమిటో మాత్రం స్పష్టత లేదు. మధ్యవర్తులు చర్చలు జరిపితే మనోజ్ తో సమస్య పరిష్కారం అయిపోతుదంని అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇక సమస్యలు ఉండవని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కూడా ఇది కుటుంబ వివాదమని పోలీసులు, మీడియా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చెప్పేసింది. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని ఇద్దరు కుమారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మనోజ్ కూడా.. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీ ఇష్యూని సన్నిహితులు సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైతే ఇక మీడియాకు మసాలా దక్కకుండా చేయాలని డిసైడయ్యారు.