ఇటీవల లండన్‌లో వరల్డ్ టూరిజం మార్కెట్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేరళ టూరిజం డైరెక్టర్, ఐఏఎస్ కృష్ణతేజ.. ఐమనమ్ రెస్పాన్సిబుల్ టూరిజం ప్రాజెక్ట్ కు గానూ డబ్ల్యూటీఎమ్ ‘ఇండియన్ రెస్పాన్సిబుల్ టూరిజం వన్ టు వాచ్’  అవార్డును అందుకున్నారు. ఏప్రిల్ 2018 నుంచి మార్చి 31, 2020 వరకు ఐమనమ్ గ్రామంలో నిర్వహించిన పర్యాటక సంబంధిత కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును అందజేశారు. కొట్టాయం జిల్లాలో ఈ గ్రామం ఉంది.


అయితే.. కేరళ టూరిజం డైరెక్టర్ కృష్ణ తేజ లండన్‌లో జరిగిన డబ్ల్యూటీఎమ్‌ కార్యక్రమంలో 'హై స్పీడ్ డైవర్సిఫికేషన్' కేటగిరీలో భాగంగా 2020 మార్చి 31తో ముగిసిన ఐమనమ్ ప్రాజెక్టుకు ఈ అవార్డును అందుకున్నారు. ఐమనమ్ ప్రాజెక్టును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 14 నెలల క్రితం బాధ్యతయుతమైన పర్యాటక గ్రామంగా ప్రకటించారు. మరోవైపు కేరళ టూరిజం ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐమనమ్ స్థానికులు.. ఆదాయాన్ని పెంపొదించేలా ప్రోత్సహించింది.  రెస్పాన్సిబుల్ టూరిజం(ఆర్టీ) మిషన్ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేసేలా కేరళ టూరిజం చర్యలు తీసుకుంది. దీని కోసం కేరళ టూరిజం డైరెక్టర్ కృష్ణతేజ ప్రత్యేక శ్రద్ధ వహించారు.


కొవిడ్ 19 తర్వాత.. పర్యాటకం కాస్త తగ్గిందని.. అయితే ఈ అవార్డుతో మరింత ఉత్సహం పెరిగిందని.. పర్యాటకాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని.. కేరళ పర్యాటక మంత్రి  మహమ్మద్ రియాస్ తెలిపారు. 'వీలైనంత త్వరగా పర్యాటకులు మళ్లీ పెరిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పర్యాటకంలో కేరళకు ఉన్న పేరును ప్రపంచ స్థాయిలో మరోసారి గుర్తు చేయడంలో డబ్ల్యూటీఎమ్ అవార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.' అని మంత్రి చెప్పారు.


రెండో దశ


రెండో దశ ప్రాజెక్టును మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేరళ టూరిజం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ గతేడాది ఐమానమ్ ను మోడల్ రెస్పాన్సిబుల్ టూరిజం విలేజ్‌గా ప్రకటించారు. ఇక్కడ పంచాయతీలో 118 రెస్పాన్సిబుల్ టూరిజం యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇది స్థానిక కమ్యూనిటీ, సందర్శకులకు వివరాలుకు పని చేస్తుంది. అంతేగాకుండా ఆర్టీ యూనిట్లతో టూరిజం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. పర్యాటక సంబంధిత కార్యకలాపాలలో 617 మందికి ఆర్టీ మిషన్ లో భాగంగా శిక్షణ ఇచ్చారు.


Also Read: Modi Launches IRIS: 'ఐరిస్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ దేశాలకు అండగా భారత్


Also Read: Amarinder Singh New Party: కాంగ్రెస్‌కు కెప్టెన్ బైబై.. 'పంజాబ్ లోక్‌ కాంగ్రెస్' పేరుతో కొత్త జర్నీ


Also Read: Ajit Pawar Income Tax: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి