Armed Forces: భారత రక్షణ రంగం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. సాంకేతిక వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్త కొత్త అధునాతన ఆయుధాలు, పరికరాలను రక్షణ రంగం సమకూర్చుకుంటోంది. అయినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అంతర్గత శక్తులను, బయటి శక్తులను, సరిహద్దుల్లో కాచుకుకూర్చున్న దేశాలను నిలువరించేందుకు భారత్ మరింతగా తన శక్తిని సమకూర్చుకోవాల్సి ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రాబోయే 10 ఏళ్లలో రక్షణ రంగంలో భారత్ ఎలాంటి అభివృద్ది సాధిస్తుంది.. భారత్ కు ఉన్న అవకాశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధునికీకరణ, స్వదేశీ అభివృద్ధి
వచ్చే 10 ఏళ్లలో భారత్ తన సాయుధ బలగాలు, పరికరాలు, ఆయుధాల ఆధునికీకరణపై దృష్టి సారించడాన్ని కొనసాగించవచ్చు. అధునాతన రక్షణ సాంకేతికతల స్వదేశీ ఆయుధాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశ రక్షణ పరిశ్రమను పెంచి స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తుంది.
సైబర్ వార్‌ఫేర్, స్పేస్ డొమైన్
క్లిష్టమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి, సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి సైబర్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రాధాన్యతనిస్తుంది. అలాగే అంతరిక్ష- ఆధారిత సాంకేతికతలను మరింత మెరుగ్గా వాడుకోనుంది.
జాయింట్ ఆపరేషన్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్స్
జాయింట్ ఆపరేషన్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ స్ట్రక్చర్ల ద్వారా భారత్ తన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను ఏకీకరణ చేసేందుకు మరింత మెరుగైన పద్ధతులను అవలంభిస్తుంది. సైనిక కార్యకలాపాల సమయంలో తన సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా కనబరిచేందుకు, మూడు వ్యవస్థల సమన్వయానికి ఇది అవసరం కానుంది.
కౌంటర్ టెర్రరిజం, అసిమెట్రిక్ వార్‌ఫేర్
తీవ్రవాద ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో.. కౌంటర్ టెర్రరిజంపై మరింతగా దృష్టిసారించనుంది. సాయుధ దళాల ప్రత్యేక కార్యకలాపాలు, నిఘా, గూఢచార వివరాల సేకరణను మెరుగుపరచుకోనుంది.
మారిటైమ్ సెక్యూరిటీ, బ్లూ-వాటర్ నేవీ
పెరుగుతున్న వ్యూహాత్మక స్థానం.. అలాగే సముద్ర జలాల్లో ప్రపంచ ప్రయోజనాలు దృష్ట్యా నావికాదళ సామర్థ్యం పెంపుపై దృష్టి సారించవచ్చు. మరింత సమర్థవంతమైన బ్లూ-వాటర్ నేవీని తయారు చేయవచ్చు.
విపత్తు ప్రతిస్పందన, మానవతా సాయం
దేశవ్యాప్తంగా ఎదురయ్యే ప్రకృతి విపత్తుల వేళ.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ కీలకంగా ఉన్న దృష్ట్యా వాటిపై మరింత దృష్టి సారించవచ్చు. అలాగే పీస్ కీపింగ్ మిషన్‌లలో మరింత చురుగ్గా పాల్గొనవచ్చు.
Also Read: India China Tunnel: చైనా సరిహద్దుల్లో సొరంగాల నిర్మాణం, రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు భారత్ చర్యలు
హైబ్రిడ్ వార్‌ఫేర్, ఇన్ఫర్మేషన్ ఆపరేషన్స్
ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, ప్రొపగండ వంటి సాంప్రదాయ, సాంప్రదాయేతర వ్యూహాలను ఎదుర్కోవడంపై భారత్ దృష్టి సారించవచ్చు. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంపై కొత్త వ్యూహాలను అనుసరించవచ్చు.
అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్, అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
డ్రోన్లు, యూఏవీలు, యూఎస్వీలు, అలాగే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వంటి వాటిని మెరుగుపరచుకునే విషయంలో మరింతగా కేటాయింపులు ఉండొచ్చు.
మెరుగైన శిక్షణ, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్
సిబ్బందికి నిరంతర మెరుగైన శిక్షణ అలాగే ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ పై రక్షణ రంగం దృష్టి పెట్టవచ్చు. తాజా సాంకేతికతలు, వ్యూహాలపై సిబ్బందిని తీర్చిదిద్దవచ్చు.
ప్రాంతీయ భద్రతా సహకారం
దేశీయంగా, పొరుగు దేశాలతో తన రక్షణ సంబంధాలు, భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి భారత్ ప్రయత్నించవచ్చు. దేశంలో స్థిరత్వాన్ని పెంపొందించడానికి నిత్యం ప్రయత్నించవచ్చు.