Gyanvapi ASI Survey: 


మూడో రోజు సర్వే..


జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వే కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెట్టి సాయంత్రం 5 గంటల వరకూ షిఫ్ట్‌ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ అక్కడ హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని సంకేతాలను గుర్తించారు అధికారులు. రెండ్రోజుల పాటు జరిగిన సర్వేలో వీటిని సేకరించిన అధికారులు వాటిని భద్రపరిచారు. బేస్‌మెంట్‌లో చేపట్టిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందువులు చెబుతున్న ప్రకారం...మసీదు బేస్‌మెంట్‌లో నాలుగు అడుగుల శివుడి విగ్రహం దొరికింది. ఈ విగ్రహంతో పాటు 2 అడుగుల త్రిశూలం కూడా ఉంది. అంతే కాదు. అక్కడి గోడలపై కమలం పువ్వు గుర్తులు కనిపించినట్టు హిందువులు చెబుతున్నారు. ఓ జంతువు విగ్రహంతో పాటు, ఓ దేవత విగ్రహం కూడా గుర్తించినట్టు వివరించారు. మరి కొన్ని విగ్రహాల శకలాలు కనిపించినట్టు తెలిపారు. మూడో రోజు కూడా భారీ భద్రత నడుమ సర్వే జరుగుతోంది. మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై హిందూ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కనిపించడం వల్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రత్యేక యంత్రాలు తెప్పించి మరీ సర్వే చేస్తున్నారు. 






"మసీదులో పశ్చిమాన ఉన్న గోడపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాం. అక్కడ ఉన్న గడ్డిని పూర్తిగా తొలగించాం. మధ్యలో ఉన్న మినార్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. అవేంటని సర్వే చేస్తున్నాం. ఆ ప్రాంతాన్ని ఎవరో కావాలనే దాచి ఉంచినట్టు గుర్తించాం. అందుకే సర్వేకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. కోర్టు మాకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. పని వేగంగానే జరుగుతోంది. రేడార్ మెషీన్ వినియోగించి సర్వే చేస్తున్నాం. ఫలితాలు వచ్చేంత వరకూ దయచేసి అంతా ఓపిక పట్టండి"


- విష్ణు శంకర్ జైన్, అడ్వకేట్ 






ఈ సర్వేపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు మరో అడ్వకేట్ సుధీర్ త్రిపాఠి వెల్లడించారు. ముస్లింలు కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని, సర్వేకి సహకరిస్తున్నారని అన్నారు. స్థానికంగా ఈ ASI సర్వేపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. 


Also Read: దొంగతనం చేశారన్న అనుమానంతో మైనర్‌లపై దారుణం, మూత్రం తాగించి కారం పెట్టి చిత్రహింసలు