BARC JRF Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
➦ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
ఫెలోషిప్‌ల సంఖ్య: 105.
విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ, 55% మార్కులతో ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ యూజీసీ- సీఎస్‌ఐఆర్- నెట్ ఫెలోషిప్/ జెస్ట్ స్కోర్/ ఐసీఎంఆర్- జేఆర్‌ఎఫ్ టెస్ట్, ఐసీఏఆర్- జేఆర్‌ఎఫ్ టెస్ట్/ డీబీటీ-జేఆర్‌బీ బెట్/ గేట్ స్కోర్ సాధించి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఫెలోషిప్: నెలకు రూ.31,000 - రూ.35,000.
ముఖ్యమైన తేదీలు..
➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2023.
➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.08.2023.
➦ ఇంటర్వ్యూ: సెప్టెంబర్/అక్టోబర్, 2023.
ALSO READ:
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 647 గ్రాడ్యుయేట్ & డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) గ్రాడ్యుయేట్ & డిప్లొమా & ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 185 డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) డిజైన్ & మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన(ఫుల్ టైమ్- 10+2 తర్వాత 4 సంవత్సరాలు) డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెహ్రాడూన్‌లో ఫెలోషిప్ పోస్టులు, అర్హతలివే!
డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, డాక్టోరల్‌డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 10, 11 వ తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..