Gujarat News: ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది. తన భాగస్వామి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది. ఒక్కోసారి తాము ప్రేమించిన వారి కోసం చేసే పనులు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. అలాంటి ఓ ఘటనే గుజరాత్ లో జరిగింది. ఓ యువతి తను ప్రేమించిన వ్యక్తి కోసం అతని బదులు తాను పరీక్ష రాస్తూ పట్టుబడింది.
గుజరాత్ కు చెందిన 24ఏళ్ల యువతి తను ప్రేమించిన వాడి కోసం తన కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ స్థానంలో తాను పరీక్ష రాస్తూ పట్టుబడింది. అసలేమైందంటే ఆ యువతి, అతని ప్రేమికుడు పాఠశాల రోజుల నుంచే స్నేహితులు. కళాశాలకు వచ్చే సమయానికి ప్రేమికులుగా మారారు. ప్రస్తుతం ఆ యువతి ప్రేమికుడు బీకామ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను ఇదివరకు రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈసారి పరీక్షల సమయానికి అతను ఉత్తరాఖండ్ వెళ్లాడు. దీంతో ఆ యువతి అతనికి బదులు తాను పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది.
డమ్మీ అభ్యర్థిగా
ఈ ఏడాది అక్టోబరులో జరిగిన బీకామ్ తృతీయ సంవత్సరం పరీక్షలను అతని స్థానంలో ఆమె రాస్తూ అధికారులకు పట్టుబడింది. తాను పరీక్ష హాలులోకి వెళ్లేందుకు వీలుగా కంప్యూటర్ సాయంతో హాల్ టికెట్ లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు ఆ యువతి తెలిపింది. అలాగే పేరులోనూ స్వల్ప మార్పులు చేసినట్లు చెప్పింది. తన వేషధారణను మార్చుకున్నట్లు తెలిపింది. పరీక్షల సమయంలో రోజూ ఇన్విజిలేటర్లు మారుతుంటారు. వారు ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా గమనించరు. అయితే హాల్ టికెట్లు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఇన్విజిలేటర్ కు అనుమానం వచ్చింది. ఆ విధంగా ఆ యువతి పట్టుబడింది.
ప్రియురాలితో ఎగ్జామ్ రాయిస్తున్న ఆ ప్రియుడిలో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు. హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు. పరీక్ష హాల్‌లో ప్రియురాలు చిక్కుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాల్సిన వ్యక్తికి అధికారులు ఫోన్ చేశారు. అతని సమాధానం విని వాళ్లంతా షాక్ అయ్యారు. ప్రియురాలిని ఎగ్జామ్‌కు పంపించిన ఆ వ్యక్తి పరీక్ష కేంద్రం పరిసరాల్లోనే ఉంటాడని వాళ్లు అనుకున్నారు. కానీ ఆ ప్రియుడు చెప్పిన వివరాలు అందర్నీ ఆశ్చర్యంలో పడేశాయి. తాను ఉత్తరాఖండ్ లో వెకేషన్‌లో ఉన్నట్టు చెప్పడంతో అక్కడి వారంతా ముక్కున వేలేసుకున్నారు.
డిగ్రీ రద్దు!
ఫెయిర్ అసెస్ మెంట్ అండ్ కన్సల్టేటివ్ టీమ్ కమిటీ (ఫ్యాక్ట్), వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్శిటీకీ కు ఆ యువతికి శిక్ష విధించే బాధ్యతను అప్పగించింది. ఆ యువతి డిగ్రీని రద్దు చేయాలని ఫాక్ట్ కమిటీ వీఎన్ ఎస్ జీయూకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు ఆమోదిస్తే ఆ మహిళ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. అలాగే నిజమైన అభ్యర్థిని మూడేళ్లపాటు పరీక్షకు హాజరు కాకుండా డిబార్ చేసే అవకాశముంది.
Also Read: ఆదిలాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు బైక్ లు ఢీకొని నలుగురు మృతి