రాజ్యాంగం ద్వారా కల్పించిన వాక్ స్వాతంత్ర్యం మరియు భావప్రకటనా స్వేచ్ఛకు కొత్త ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. వినియోగదారులపై అదనపు బాధ్యతలను ఉంచవద్దని భావించింది. మార్గదర్శకాలపై తరచుగా అడిగే ప్రశ్నల సెట్‌ను విడుదల చేశారు. వ్యక్తుల ఆన్‌లైన్ ప్రైవసీకి కాపాడేందుకు నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకున్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 


మొత్తం మీద, FAQలు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వినియోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని, మహిళలు, చిన్నారుల భద్రతను మరించ పెంచేందుకు రూల్స్ ఉన్నాయి. మంత్రిత్వ శాఖ నిబంధనలు స్వేచ్ఛ,వాక్ స్వాతంత్ర్య హక్కును ఉల్లంఘించవని ఓ ప్రశ్నకు బదులిచ్చింది. కొత్త IT నియమాలు, 2021 యూజర్ల హక్కులకు అనుగుణంగా రూపొందించారు. వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించవని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని, అయితే వినియోగదారులకు ఎలాంటి హాని కలగకూడదని భావించామని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ FAQలను విడుదల చేశారు.


Also Read: ఒక్కసారి చార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు.. సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇదే!


సోషల్ మీడియాను ప్రాథమికంగా లేదా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వినియోగదారుల మధ్య ఆన్‌లైన్ ఛాటింగ్, ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా ప్రస్తావించారు. దీని ద్వారా సమాచారం మార్పిడి జరుగుతుందని పేర్కొన్నారు. వాణిజ్య లేదా వ్యాపార ఆధారిత లావాదేవీలను ప్రారంభించడం, ఇంటర్నెట్ లేదా సెర్చింజన్ సేవలు, ఈ-మెయిల్ సర్వీసులు, ఆన్‌లైన్ స్టోరేజ్ సేవ మొదలైన వాటికి ప్రాథమిక విషయాలలో యాక్సెస్ ఉంటుంది. ఇలాంటి వాటిలో సోషల్ మీడియాను మధ్యవర్తిగా భావించలేమని మంత్రిత్వ శాఖ 20 పేజీల పత్రాలలో తెలిపింది. సోషల్ మీడియా మధ్యవర్తిగా అర్హత సాధించడానికి, ఆన్‌లైన్ ఇంటరాక్షన్ చేయడానికి మధ్యవర్తి యొక్క ప్రాథమిక లేదా ఏకైక ఉద్దేశం ఉండాలని అభిప్రాయపడింది.


ఏదైనా ఇతర కారణాలతో ఆన్‌లైన్ ఇంటరాక్షన్ చేసే సంస్థ లేదా సోషల్ మీడియాను మధ్యవర్తిగా పరిగణించబడదన్నారు. సామాజికంగా ఇతరులతో కలిపేందుకు వీటినియోగదారులకు వారి ఫాలోయింగ్ పెంచుకునేందుకు సోషల్ మీడియా అవకాశం కల్పిస్తోంది. పరిచయం లేని వ్యక్తులతో సైతం విషయాలు షేర్ చేసుకునే అవకాశం సోషల్ మీడియాలో ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌లకు ఉపసంహరణ నోటీసులను జారీ చేసే అధికారం ఉన్న తగిన ఏజెన్సీల వివరాలను కలిగి ఉండే ఐటీ నియమాలు మరియు మధ్యవర్తిత్వ నిబంధనల చుట్టూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)తో మంత్రిత్వ శాఖ బయటకు వస్తుంది.


ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. ఏదైనా మధ్యవర్తి ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది నెటిజన్ల భద్రతను పెంచడానికి మరియు ఫిర్యాదుల పరిష్కార విధానం ద్వారా ప్లాట్‌ఫారమ్‌లకు జవాబుదారీతనాన్ని కలిగిస్తుంది. చట్టాల ద్వారా సైబర్ క్రైమ్ నివారించడానికి, బాధితులు ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సరైన కంటెంట్ పోస్ట్ చేయని వారిపై చర్యలు తీసుకునేందకు దోహం చేస్తాయని ఐటీ శాఖ పేర్కొంది.


Also Read: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!


కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ మరియు నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఒకే వ్యక్తి ఉండకూడదు. అయితే నోడల్ కాంటాక్ట్ పర్సన్ మరియు రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సేవలను మాత్రం ఒకే వ్యక్తి అందించవచ్చు. అదే సమయంలో నోడల్ కాంటాక్ట్ పర్సన్ మరియు రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ యొక్క పనిని, సేవలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి (SSMI) రెండు పోస్టులకు వేర్వేరు వ్యక్తులను నియమిస్తే మేలని పేర్కొంది. 


పేరెంట్ ఎస్ఎస్ఎంఐ దాని ఉత్పత్తులు/సేవలకు అధికారులను నియమించవచ్చు. కానీ ఈ అధికారులను సంప్రదించడానికి పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. దీనివల్ల ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విషయంపై తలెత్తిన ప్రశ్నకు.. కేవలం వినియోగదారుడి రిజిస్ట్రేషన్ వివరాలు సంస్థకు చేరతాయని బదులిచ్చింది. ఎన్‌క్రిప్ట్ చేయని మెస్సేజ్, సమాచారం 'హాష్ విలువ'పై ఆధారపడి ఉంటుంది, ఒకే ప్లాట్‌ఫామ్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌ల వివరాలు ఎస్ఎస్ఎంఐ అనే ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి వద్ద ఉంటాయి. అయితే సమాచారం గోప్యతపై ఆందోళన అవసరం లేదని కేంద్రం చెబుతోంది.


ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్‌తో సహా పెద్ద టెక్ కంపెనీల జవాబుదారీతనం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఐటీ రూల్స్‌లో సవరణలు చేసింది. నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అధికారులు ఫ్లాగ్ చేసిన ఏదైనా కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది.  ఫిర్యాదులకు సైతం వేగంగా స్పందించి చర్యలు చేపట్టాలి. నగ్నత్వం లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదును స్వీకరించిన 24 గంటల్లోగా తొలగించాలి. 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వినియోగదారులు ఉన్న సోషల్ మీడియా సైట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.


Also Read: Dhanteras 2021: ఈ దంతేరాస్‌కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్


సైబర్ ప్రపంచం అభివృద్ధి చెందుతున్నా.. మంచితో పాటు చెడు పెరుగుతోందని.. జవాబుదారీతనం పెంచితే వినియోగదారుల సమాచారానికి భద్రత ఉంటుందన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే ప్రభుత్వ విధాన రూపకల్పన లక్ష్యమని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్‌లో 80 కోట్ల మంది ఆన్‌లైన్‌ వినియోగదారులు ఉన్నారని, నిబంధనలపై స్పష్టత తీసుకురావడం తమ బాధ్యత అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ మార్పులను మెటా కంపెనీ ప్రతినిథి స్వాగతించారు. కంపెనీ తరచుగా అడిగే ప్రశ్నల వివరాలను గూగుల్ ఎప్పటికప్పుడూ సమీక్షిస్తుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి