మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. గత కొన్ని రోజులుగా పలుమార్లు న్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం నాడు తొలిసారిగా ముంబయి కార్యాలయానికి అనిల్ దేశ్‌ముఖ్ విచారణకు హాజరయ్యారు. అయితే 12 గంటల పాటు  విచారించిన అనంతరం ఈడీ అధికారులు సోమవారం రాత్రి మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేశారు. 


ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కేసులో ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని ఆయనపై ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర కేబినెట్ నుంచి ఆయన తప్పుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ గత నాలుగు నెలలుగా ఆయనకు నోటీసులు జారీ చేస్తూనే ఉంది. అయితే ఏదో కారణం చూపి విచారణను వాయిదా వేసుకుంటూ వచ్చారు. తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ తమ నోటీసులలో పేర్కొంది. విచారణ నుంచి మినహాయింపు కోరుతూ అనిల్ దేశ్‌ముఖ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీపీ నేత పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడం ఆపై విచారణకు హాజరుకాని కారణంగా  అయితే ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది. 


Also Read: కేసీఆర్‌కు ఎమ్మెల్సీ పరీక్ష ! అసంతృప్తుల్ని బుజ్జగించడమే అసలు టాస్క్ !


వసూలు చేయాలని ఆదేశాలు..
తన మంత్రి పదవిని దుర్వినయోగం చేస్తూ ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలోని రెస్టారెంట్లు, బార్ల నుంచి భారీగా నగదు వసూలు చేసి ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఈడీ చెబుతోంది. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను ఈ మాజీ హోంమంత్రి ఆదేశించినట్లు ఆరోపణలున్నాయి. తనపై వరుస ఆరోపణలు రావడం, ఈడీ విచారణకు నోటీసులు పదే పదే జారీ కావడంతో మంత్రి పదవికి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆరోపణల నేపథ్యంలో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి ఆయనపై విచారణ చేపట్టింది. 


Also Read:  కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల బీమా.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రాహు‌ల్ సభ ! 


Also Read: తెలంగాణకు మరో అంతర్జాతీయ ఘనత... ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఎఫ్ఏవో..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి