మెడికల్, డెంటల్, ఆయుష్ విభాగాల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న దేశ వ్యాప్తంగా ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించిన నీట్-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యార్థుల మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లకు ఎన్‌టీఏ ర్యాంక్ కార్డులు పంపించింది. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.
సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆ తర్వాతి రోజు ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు భావించారు. అయితే, నాలుగు రోజులైనా ఫలితాలు రాకపోడంపై విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఎన్‌టీఏ అధికారులు ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. అభ్యర్థులంతా ఒకసారి తమ ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవాలని, ఒకవేళ నీట్ ఫలితాలకు సంబంధించిన స్కోర్ కార్డులు రాకపోతే వేచి చూడాలని ఎన్‌టీఏ కోరింది. ఈ స్కోర్ కార్డులు మెయిల్‌కు పంపే ప్రక్రియ 1-2 రోజులు పట్టవచ్చని తెలిపింది. అభ్యర్థులు కొంత సంయమనంతో వేచి ఉండాలని సూచించింది.
ఈ లింక్ క్లిక్ చేసి.. http://neet.nta.nic.in/ ఫలితాలను చూసుకోవచ్చు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న నీట్ పరీక్ష నిర్వహించారు. ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగింది. ముంబయిలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అంతవరకు ఫలితాల విడుదల ఆపివేయాలని చెప్పింది. బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్‌టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం.. ఆ ఇద్దరి విద్యార్థుల విషయాన్ని దీపావళి సెలవుల అనంతరం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటికే సిద్ధం చేసిన నీట్ 2021 ఫలితాలను అధికారులు సోమవారం సాయంత్రం విడుదల చేశారు.
Also Read: SHE STEM 2021: విద్యార్థులకు లక్కీ ఛాన్స్.. ఇలా.. ఇన్ స్టా గ్రామ్ రీల్ చేయండి.. ప్రైజ్ గెలవండి
Also Read: New Courses: ఇదిగో కొత్త కోర్సులు.. పూర్తి చేయగానే జాబ్ వచ్చేలా డిజైన్.. ఇక చేయడమే లేటు
Also Read: Army College: తొలిసారి ఆర్మీ కాలేజీలో బాలికలకూ ప్రవేశం... దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే