తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలకు రూ. రెండు లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్పించాలని రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అంటే ఓ గౌరవం అని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం.. అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. నాలుగు నెలల పాట డిజిటల్ సభ్యత్వ కార్యక్రమం జరగనుంది.
Also Read : ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సజ్జనార్ మరో ఐడియా... ఈసారి ప్రిన్స్ మహేశ్ బాబు రంగంలోకి...!
నవంబర్ 14 నుంచి ఏడు రోజులపాటు జన జాగరణ పాదయాత్రలు చేయాలని నేతలు నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలని వివరిస్తూ నవంబర్ 14 నుంచి ఏడు రోజుల పాటు వీటిని చేస్తారు. నవంబర్ 9, 10వ తేదీల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తారు. 119 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లని నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. కీలకమైన నియోజకవర్గాల్లో సమన్యవకర్తలను నియమిస్తే పార్టీ కార్యక్రమాలను మరింత చురుగ్గా నిర్వహించే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.
Also Read : నాగశౌర్య విల్లాలో పేకాట క్లబ్..ప్రముఖలే ఖాతాదారులు ! హీరోది సైడ్ బిజినెస్సా ? స్నేహితులు ఇరికించేశారా ?
పార్టీని నిరంతరం యాక్టివ్‌గా ఉంచి.. ప్రజల్లోకి వెళ్లేలా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాహుల్ గాంధీని ఓ సారి తెలంగాణ పర్యటనకు తీసుకు రావాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్స్‌లో రాహుల్‌గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో పర్మిషన్ ఇవ్వకపోతే నగర శివారులో అయినా నిర్వహించాలని అనుకుంటున్నారు. డిసెంబర్ 9న తెలంగాణకు వచ్చేందుకు రాహుల్ గాంధీ దాదాపుగా అంగీకరించారని అంటున్నారు.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రాలేదు. గతంలో వరంగల్ దళిత - గిరిజన దండోరా సభకు వస్తారని ప్రకటించినా.. చివరికి సాధ్యం కాలేదు. రాహుల్ గాంధీని తెలంగాణకు రప్పించి బలప్రదర్శన చేసి.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపు పలువురు అసంతృప్త టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. రాహుల్ గాంధీ సభలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి