అది హైదరాబాద్ శివారులో ఉన్న ఫామ్‌హౌస్ లాంటి గెస్ట్ హౌస్. ఫామ్ తక్కువ... హౌస్ ఎక్కువ. ఓ రకంగా విల్లా. అందులో రాత్రంతా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. పూర్తిగా తెల్లవారక ముందే పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాంతో ఆ ఇంట్లో నుంచి బిలబిలమని కొంత మంది బయటకు వచ్చి పారిపోవాలని చూశారు. కానీ అప్పటికే పోలీసులు రౌండప్ చేసేశారు. దీంతో ఎవరూ పారిపోలేకపోయారు. అందరూ చిక్కారు. దాదాపుగా 20 మంది. అందర్నీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్పాట్‌లో జరిగిన సీన్ ఇది. కనీ ఆ తర్వాతే అసలు డ్రామా ప్రారంభమయింది.
Also Read : అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య... 80 కిలోమీటర్లు వెంబడించి కాల్పులు
మంచి రేవుల సమీపంలో ఉన్న ఆ విల్లా ఎవరిదో బయటకు తలియడంతోనే అసలు ఈ రొటీన్ క్రైమ్ కథకు చాలా గ్లామర్ చేరిపోయింది. ఆ విల్లాలో పట్టుబడిన ఇరవై మంది పేకాట ఆడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సవాలక్ష పేకాట రహస్య శిబిరాల్లో అదీ ఒకటి. కానీ అక్కడ దొరికిపోయారు. దొరికిన వాళ్లు దొంగలు కాబట్టి వాళ్లు కూడా దొరికిపోయారు. అయితే వారు పేకాట ఆడుతున్న విల్లా యువ హీరో నాగశౌర్య లీజుకు తీసుకున్నదన్న విషయం బయటకు తెలిసిన తర్వాత సాదాసీదా కేసుకు కావాల్సినంత గ్లామర్ చేరుకుంది. కావాల్సినంత రచ్చ ప్రారంభమయింది.
Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..
నాగశౌర్య లీజుకు తీసుకున్న విల్లాలో పేకాట ఆడుతున్న వారిలో ప్రముఖులు ఉన్నారు. శ్రీరామ్ భద్రయ్య అనే ఓమాజీ ఎమ్మెల్యేతో పాటు హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ గ్రూప్ వాసవి యజమానుల్లో ఒకరైన రాజారామ్ ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ మోసగాడిగా పోలీస్ రికార్డుల్లో ఉండి.. ఎవరికీ చిక్కకుండా తిరిగే మద్దతు ప్రకాష్ అనే వ్యక్తి కూడా పేకాట ఆడుతూ దొరికిపోయిన వారిలో ఉన్నారు. మిగతావారిలోనూ ప్రముఖులు ఉన్నారని చెబుతున్నారు కానీ వారెవరో బయటకు రావడం లేదు. వీరందర్నీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
( మద్దుల ప్రకాష్, పేకాట స్థావరంలో దొరికిన వ్యక్తి )
Also Read: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
నటుడు నాగశౌర్య లీజుకు తీసుకున్నాడు కాబట్టి ఆ పేకాట క్లబ్‌ను ఆయనే నిర్వహిస్తున్నారా అన్న అనుమానాలు మొదట్లో పోలీసులు వ్యక్తం చేశారు. అయితే కాస్త లోతుగా విచారణ జరిపిన తర్వాత లీజు హీరోదే అయినా.. అయనకు విలన్‌గా పరిచయస్తుడు అయిన గుత్తా సుమన్ కుమార్ ఉన్నట్లుగా తేల్చారు. ఈ గుత్తా సుమన్ కుమారే మొత్తం కింగ్ పిన్‌గా పోలీసులు ఓ అంచనాకు వచ్చి ఫోన్ సీజ్ చేశారు. అయితే ఈ సుమన్ వెనుక నాగసౌర్య బాబాయ్ బుజ్జి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి వారికి నోటీసులు జారీ ప్రశ్నించనున్నారు.
( వాసవి గ్రూప్ రాజారామ్.. పేకాట శిబిరంలో దొరికిన వ్యక్తి )
Also Read : భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
ప్రైవేటు ఫామ్‌హౌస్‌లు, ఇళ్లలో పేకాట శిబిరాలు విస్తృతంగా నిర్వహిస్తూ ఉంటారు. సమాచారం అందిన చోట పోలీసులు పట్టుకుంటూనే ఉంటారు. అయితే ఇదేమంత పెద్ద సీరియస్ కేసులు కాదని చెబుతూంటారు. ఏపీకి చెందిన ఓ మంత్రి మాటల్లో చెప్పాలంటే " పేకాట ఆడితే ఏమవుతుంది.. యాభై రూపాయల ఫైన్ కట్టి మళ్లీవచ్చి బయట ఆడుకుంంటారు అంతే.. ఉరేమీ వేయరు కదా..!" అంతే. కానీ ఇక్కడ సినిమా నటుడు నాగశౌర్య పేరు రావడంతో హైలెట్ అవుతుంది.
Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి