తెలంగాణలో ఆరుగురు, ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలు జూన్ మొదట్లోనే పదవీ విరమణ చేశారు. వారు పదవీ విరమణ చేసే లోపు కొత్త వారిని ఎన్నుకోాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా అప్పట్లో ఎన్నికలను వాయిదా వేశారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంోత ఆదివారం షెడ్యూల్ రిలీజ్ చేశారు. అవి ఎమ్మెల్యే కోటా ఎన్నికలు. అన్నీ ఏకగ్రీవంగా పూర్తవుతాయి. ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదు. కానీ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో  కేసీఆర్ టీఆర్ఎస్ అధినేత కూడా ఎన్నికలు పెట్టాలని ఈసీపై ఒత్తిడి చేయలేదు. 


Also Read : తెలంగాణకు మరో అంతర్జాతీయ ఘనత... ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన ఎఫ్ఏవో..!


ఇప్పుడు షెడ్యూల్ రావడంతో అభ్యర్థుల్ని ఎంపిక చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. పదవీ కాలం పూర్తయిన ఆరుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ నేతలే. దీంతో సహజంగానే వారందరూ మరో టర్మ్ అవకాశం కోరుకుంటున్నారు. కానీ ఆరు స్థానాలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, టిక్కెట్ దక్కని వారు, పార్టీలోని సీనియర్లు, టిక్కెట్ కోసం పోటీ పడి ఎమ్మెల్సీ హామీ పొందిన వాళ్లు .. ఇలా అనేక కేటగిరిల కింద 40 నుంచి యాభై మంది వరకూ ఉన్నారు. వీరందరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 


Also Read:  కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే రూ. 2 లక్షల బీమా.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రాహు‌ల్ సభ !


గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలితల పదవి కాలం ముగిసింది. వీరందరూ మరో అవకాశం కోరుతున్నారు. కానీ  ఒకరిద్దరికి మాత్రమే చాన్స్ వస్తుందని భావిస్తున్నారు. గుత్తా, కడియంలకు అవకాశం లభిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్న వారిలో క్యామ మల్లేశం, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, సలీం, బండి రమేష్, బొంతు రాంమ్మోహన్, మధుసూదనాచారి, కడియం శ్రీహరి , ఎంసీ కోటిరెడ్డి, కర్నాటి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, మోత్కుపల్లి నర్సింహులు,, ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి లాంటి సీనియర్లు ఉన్నారు. వీరిలో అందరికీ అవకాశం ఇవ్వడం దుర్లభం కాబట్టి  కొంత మంది అసంతృప్తికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 


Also Read: ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు సజ్జనార్ మరో ఐడియా... ఈసారి ప్రిన్స్ మహేశ్ బాబు రంగంలోకి...!


ఇటీవల గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేశారు. ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. ఒక వేళ గవర్నర్ ఆమోదించకపోతే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటాలో పంపుతారేమో చూడాల్సి ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఆరుగురు ఎమ్మెల్సీలను ఎంపిక చేయడం కేసీఆర్‌కు కత్తి మీద సాములా మారింది.


Also Read: హుజూరాబాద్, బద్వేల్ కౌంటింగ్ కౌంట్ డౌన్ ... మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి