Manmohan Singh diagnosed with Dengue: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు డెంగీ సోకినట్టు ఎయిమ్స్ వైద్యులు శనివారం వెల్లడించారు. ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరుగుతుండటంతో మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతోందని ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ఆయనకు జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరారు, కోలుకుంటున్న క్రమంలో డెంగీ నిర్ధారణ కావడం కాంగ్రెస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది.
సీనియర్ నేత మన్మోహన్ సింగ్(89)కు సోమవారం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం జ్వరం వచ్చినా.. రెండు రోజుల్లో కాస్త కోలుకున్నట్లు కనిపంచారు. జ్వరం తగ్గినా శరీరం అంత యాక్టివ్ గా లేకపోవడంతో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కార్డియో - న్యూరో సెంటర్ ప్రైవేటు వార్డులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చికిత్స తీసుకుంటున్నారు. డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
Also Read: టీఆర్ఎస్‌లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు.. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం!
జ్వరం తగ్గినా యాక్టివ్‌గా లేకపోవడంతో వైద్యులు టెస్టులు చేయగా డెంగీగా నిర్ధారించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ప్లేట్ లెట్ సంఖ్య పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్లు పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మాజీ ప్రధాని ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ మాజీ సీఎఖం కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా తదితర నేతలు మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read: హజురాబాద్ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు ! టీఆర్ఎస్‌లో పదవుల సందడి !
మన్సుఖ్ మాండవీయ వివాదం..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం వెళ్లి మాజీ ప్రధానిని పరామర్శించారు. అయితే మన్సుఖ్ మాండవీయ ఎయిమ్స్‌కు తనతో పాటు ఫొటోగ్రాఫర్ ను తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఇలాంటి పని చేయడంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ మండిపడ్డారు. తన తల్లికి ఇలాంటివి నచ్చవని, కుటుంబం ఎంతో ఆవేదనకు లోనైందన్నారు. ఫొటోగ్రాఫర్‌ను బయటకు వెళ్లమని చెప్పారు. తన తల్లిదండ్రులు వయసు మీద పడ్డ వ్యక్తులు మాత్రమేనని, జూలో జంతువులు కాదంటూ మన్సుఖ్ మాండవీయ తీరును దమన్ సింగ్ విమర్శించారు.
Also Read: ఏపీ ఐటీకి సరికొత్త బ్రాండింగ్.. మంత్రి మేకపాటి బ్రాండ్ న్యూ ఆలోచన !