ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ బ్రాండింగ్ తీసుకురావాలని ప్రభుత‌్వం నిర్ణయించింది. బ్రాండింగ్ ఉంటే కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో వస్తాయని భావిస్తున్నారు.  ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐటీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఉండాలంటే .. ఓ ప్రత్యేకత ఉండాి. అందుకే ఐటీ శాఖ బ్రాండింగ్‌పై ప్రత్యేక​ దృష్టి పెడుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేకత తీసుకొచ్చే అ ప్రాజెక్ట్‌ను వర్క్ ఫ్రం హోమ్ టౌన్లుగా గుర్తించారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. డిసెంబర్‌ 24 కల్లా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాత..  ఐటీ బ్రాండింగ్‌ కార్యాచరణ రూపొందించాలని మంత్రి గౌతం రెడ్డి అధికారులను ఆశించారు. 




Also Read : విద్యుత్ కోతలు లేవు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ! ఏపీ ప్రభుత్వం క్లారిటీ !


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ల పైలట్‌ ప్రాజెక్టు ను మొదట 29 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్‌గా వీటిని పూర్తి చేసి ప్రారంభిస్తారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లలో ఉద్యోగులు పని చేసుకోవచ్చు. అంటే కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చి ఉంటే...వారు అందరూ సొంత ఊళ్లలో ఉండి..  నెట్ వర్క్ ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్లలోకి వచ్చి పని చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వం ఉచితంగా కల్పించే సౌకర్యం. 


Also Read : ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్.. 40 కోర్సుల్లో సర్టిఫికేషన్..


వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి గౌతం రెడ్డి భావిస్తున్నారు. తమ కాన్సెప్ట్ గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించి... మరింత మద్దతు పొందాలనే ఆలోచన చేస్తున్నారు.  .త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరించాలని నిర్ణయించారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లు అందుబాటులోకి వస్తే బ్రాండింగ్‌కు సరైన వేదిక ఏర్పడుతుందని మంత్రి భావిస్తున్నారు. 


Also Read : జగన్ ప్రభుత్వంపై డీఎల్ విమర్శలు ! గుర్తించలేదనే అసంతృప్తే కారణమా ?


ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఇప్పటికే మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరినైనా పెట్టడం కాకుండా.. ఏపీలోఓ ప్రాజెక్ట్ అంబాసిడర్‌గా ఉండాలన్నది మంత్రి ఆలోచన. ఆయన ఆలోచన సక్సెస్ అయితే ఏపీ ఐటీకి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. అది వస్తే ఐటీ పరిశ్రమలు వెల్లువలా వచ్చే అవకాశ ఉంది. 


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి