అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ 10 సిరీస్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ కెమెరాలు, 5జీ ప్రాసెసర్లు ఉన్నాయి. వీటిపై ఎక్స్‌చేంజ్ కూడా అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంకు లేదా సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా మీరు ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
1. రెడ్‌మీ 10 ప్రైమ్
ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా, ఈ సేల్‌లో రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. సిటీ బ్యాంకు లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపు లభించనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
రెడ్‌మీ 10 ప్రైమ్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2. రెడ్‌మీ నోట్ 10ఎస్
రెడ్‌మీ ఈ సంవత్సరం లాంచ్ చేసిన బెస్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 కాగా, ఈ సేల్‌లో రూ.15,999కే కొనుగోలు చేయవచ్చు. సిటీ బ్యాంకు లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 తగ్గింపు లభించనుంది. 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో, పొర్‌ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
రెడ్‌మీ నోట్ 10ఎస్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
3. రెడ్‌మీ నోట్ 10 లైట్
రెడ్‌మీ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్‌పై కూడా మంచి ఆఫర్లు అందించారు. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా, ఈ సేల్‌లో రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ సూపర్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా కూడా ఉన్నాయి. 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ మల్టీ టచ్ స్క్రీన్ కూడా ఇందులో అందించారు.
రెడ్‌మీ నోట్ 10 లైట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
4. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ
తక్కువ ధరలో రెడ్‌మీ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది మంచి ఆప్షన్. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999 కాగా, ఈ సేల్‌లో రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
5. రెడ్‌మీ నోట్ 10 ప్రో
ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, ఈ సేల్‌లో రూ.17,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5020 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
రెడ్‌మీ నోట్ 10 ప్రో కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి