హుజురాబాద్ ఉపఎన్నిక ముగిసిన వెంటనే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుజి ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ఎన్నిక అయిన హుజారాబాద్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పెండింగ్‌లో పడిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికలెప్పుడు అని టీఆర్ఎస్ నేతలు కిందా మీదా పడుతున్నారు. శాసనమండలికి శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగిసింది. గవర్నర్ కోటా నుంచి ఒకరి పదవీకాలం పూర్తైంది. వీరంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. వాస్తవానికి మేలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణమంగా ఈసీ వాయిదా వేసింది. ఇప్పటి వరకూ జరగలేదు. హుజురాబాద్ ఎన్నికలు ముగియగానే నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.


Also Read : హుజూరాబాద్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..


ప్రత్యక్ష ఎన్నికలు అయిన హుజురాబాద్ పోలింగే నిర్వహిస్తూడటంతో ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కూడా నిర్వహిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశ పడుతున్నారు.  కొద్ది రోజలు కిందట ఎన్నికల విషయంలో ఈసీ తెలంగాణ సర్కార్ అభిప్రాయాన్ని కోరింది. అయితే  ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడల్లా సాధ్యం కాదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖరాశారు.  దీంతో ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మళ్లీ ఆలోచించలేదు. 


Also Read : తెలంగాణ ప్రాజెక్టులిస్తేనే తామిస్తామన్న ఏపీ ! కేఆర్ఎంబీ గెజిట్ అమలుపై మళ్లీ మొదటికొచ్చిన వివాదం !


నిజానికి జరగాల్సినవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. అన్నీ ఏకగ్రీవంగా పూర్తవుతాయి. ప్రతిపక్ష పార్టీలకు నామినేషన్ వేసేంత బలం కూడా లేదు. అందుకే ఎన్నికలు జరగవు. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు నిర్వహిస్తూండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పెడతారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులు తమ ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మె్ల్సీ స్థానానికి ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును ఖరారు చేసి గవర్నర్‌కు పంపింది. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ పట్టుబడతారా లేకపోతే.. కౌశిక్ రెడ్డికి షాక్ ఇస్తారా అన్నది వేచి ఆసక్తికరంగా మారింది.  


Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !


మిగిలిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్‌లో చాలా పోటీ ఉంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కనీసం నలుగురు నేతలు తమకు ఎమ్మెసీ ఇస్తారని ఆశ పడుతున్నారు. ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు.  పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న వారు కూడా ఉన్నారు. అలాగే పదవీ కాలం పూర్తయిన వారు కూడా మళ్లీ తమకు అవకాశం ఇస్తారని ఆశ పడుతున్నారు. మరో వైపు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది పదవీకాలంలో వచ్చే ఏడాది జనవరి 4న ముగియనుంది. అప్పుడు మరికొంత మంది టీఆర్ఎస్ నేతలకు అవకాశాలు దక్కనున్నాయి. 


Also Read : హుజురాబాద్‌కు దసరా తర్వాత స్టార్ క్యాంపెయినర్ల క్యూ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి