హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంపై దసరా ఎఫెక్ట్ పడింది. పండగ సందర్భంగా అన్ని  పార్టీలూ జోరు తగ్గించాయి. ముఖ్య నేతలెవరూ ప్రచారంలో లేరు. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. దసరా తర్వాత అన్ని  అన్ని ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీల నుంచి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ సభలకు అనుమతి లేకపోవడంతో రోడ్ షోలకు, గల్లీ గల్లీ ప్రచారాలకు సిద్ధమవుతున్నారు.  


Also Read : ఇక చార్మినార్ వద్ద కూడా సండే ఫన్ డే.. స్టాల్ పెడితే లాభాలు! ఇలా అప్లై చేసుకోవచ్చు.. HMDA ప్రకటన


టీఆర్ఎస్ నుంచి ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ల జాబితానుప్రకటించారు. 20 మంది ముఖ్య నేతల్లో 17 మంది ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సైతం ఓ సారి ఓటు అడిగారు. ఇప్పటి వరకూ నేరుగా కేసీఆర్ , కేటీఆర్ ప్రచారంలోకి దిగలేదు. వారిద్దరూ కూడా ప్రచారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  ఈటల రాజేందర్ ను ఎలాగైనా ఓడించేందుకు హరీష్ రావు పూర్తిగా హుజురాబాద్‌పైనే దృష్టి కేంద్రకరించారు. టీఆర్ఎస్ నేతలకు చెందిన ఓ కాలేజీ కేంద్రంగా ఆయన  రాజకీయ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పది మంది ఓటర్లను ప్రభావితం చేస్తారనుకున్న ఏ వ్యక్తినీ వదలకుండా కండువా కప్పేస్తుస్తున్నారు.  


Also Read: తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?


ఇక బీజేపీ కూడా హుజురాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.   తమ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని గెలిపించుకోవడానికి ముఖ్య నేతలను ప్రచారంలోకి దించాలని నిర్ణయించారు.  బండి సంజయ్ ,ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో ప్రచార బాధ్యతలు తీసుకోనున్నారు.  విజయశాంతి కూడా పూర్తిగా హుజురాబాద్ ఎన్నికలకు తన సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు.  గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ను సిద్ధం చేసుకున్న బిజెపి ,ఈటల రాజేందర్ కి వచ్చే వ్యక్తిగత ఓటు బ్యాంక్ కాకుండా మెజారిటీ పై దృష్టి పెట్టాలని  భావిస్తోంది. ఆ పార్టీ కేంద్ర  నేతల్ని కూడా ప్రచారానికి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు.  


Also Read : కాలం మారింది.. తెలంగాణ ఏం చేస్తే రేపు భారత్ అదే చేస్తోంది: మంత్రి కేటీఆర్


కాంగ్రెస్ కూడా 20 మందితో తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించేశారు.   తాము ఉప ఎన్నికలు సీరియస్‌గా తీసుకున్నామని ప్రకటించడానికి భారీస్థాయి ప్రచారానికి సిద్ధమైంది కాంగ్రెస్. హేమాహేమీలను నామినేషన్ రోజు తమ అభ్యర్థి బల్మూర్ వెంకట్ తో పాటు వెంట తీసుకు వచ్చింది. అలా నామినేషన్ వేశారో లేదో ఇలా అధికార పార్టీపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి . ఓటు బ్యాంక్‌ను కాపాడుకునే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. 


Also Read: బీజేపీ నేత అక్రమ సంబంధం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఫ్యామిలీ.. చెప్పులతో దాడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి