నెల్లూరు జిల్లాలో సామూహిక అత్యాచారం అంటూ ఓ మైనర్ బాలిక చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ బాలిక ఆరోపణలు చేసింది. ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే బాలిక చెబుతున్న కథనానికి, కుటుంబ సభ్యుల వాదనకు, వాస్తవంగా జరిగిన ఘటనకు పొంతన లేదని పోలీసులు గుర్తించారు. దీంతో ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Also Read: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు... నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు


అసలేం జరిగింది..?
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రామానుజపురం గ్రామంలో మైనర్ బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అరుంధతీయ వాడకు చెందిన బాధిత బాలిక పెరుగు ప్యాకెట్ కోసం ఊరిలోకి వెళ్తే.. నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేశారని బంధువులు చెబుతున్నారు. బాలిక చేతులు, కాళ్లు కట్టేసి చెరువులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని బాలిక చెబుతుండగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఓ వ్యక్తి పైనే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


Also Read: దేవరగట్టులో కర్రల సమరం... బన్ని ఉత్సవాల్లో చెలరేగిన హింస.. వంద మందికి గాయాలు


పొంతన లేని సమాధానాలు రావడంతో.. 
ఘటనకు సంబంధించి బాలిక చెబుతున్న కథనానికి.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారానికి పొంతన లేదని పోలీసులు గుర్తించారు. పెరుగు ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లి.. ఇంటికి ఆలస్యంగా రావడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించారని.. దీంతో ఆమె కట్టుకథ అల్లిందని స్థానికులు అంటున్నారు. బాలిక ఓ వ్యక్తితో అరగంట సేపు చెరువు దగ్గర ఉందనే వాదనలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. బాలిక నలుగురు వ్యక్తుల గురించి చెబితే.. కుటుంబ సభ్యులు ఒకరిపై ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావుతీసింది. దీంతో నేరుగా డీఎస్పీ రంగంలోకి దిగి ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది సామాజిక అత్యాచార యత్నామా? లేదా సైలెంట్ ప్రేమ వ్యవహారమా? అనే కోణంలో విచారిస్తున్నారు.  


Also Read: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం


Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం... రానున్న 24 గంటల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు... హైదరాబాద్ కు భారీ వర్ష సూచన 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి