ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సముద్రంలో అలలు ఎగసి పడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. 






Also Read: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా


ఉత్తరాంధ్ర జిల్లాల్లో జోరుగా వర్షాలు


అల్పపీడన ప్రభావంతో వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 


Also Read: టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..లాఠీలకు పనిచెప్పిన పోలీసులు






హైదరాబాద్ కు భారీ వర్ష సూచన


హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌, చింతకుంట ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా వనస్థలిపురం, కిస్మత్‌పూర్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్‌, లంగర్‌ హౌస్‌, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. రోడ్లపై జలమయం అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.  


Also Read: ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి