Food delivery Boy: 



లింక్డిన్‌లో వైరల్ పోస్ట్..


ఏసీ గదుల్లో పని చేస్తూ..ఐదంకెల జీతాలు తీసుకుంటూ కూడా మనం రకరకాల కారణాలు చెబుతూ అసంతృప్తితో ఉంటాం. కొంత మంది మాత్రం తాము చేసే ఉద్యోగం చిన్నదే అయినా...దాన్ని ఆస్వాదిస్తారు. జీతంతో సంబంధం లేకుండా పనిని ఎంజాయ్ చేస్తారు. అందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అలాంటి ఓ యువకుడి కథే ఇప్పుడు వైరల్ అవుతోంది. లింక్డిన్‌లో (LinkedIn)ఓ మహిళ ఆ యువకుడి కథంతా చెప్పింది. ఓ టెక్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్న ఓ మహిళ..స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ స్టోరీని పోస్ట్ చేసింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు దాదాపు 3 కిలోమీటర్ల నడుచుకుంటూ వచ్చాడు. ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఖర్చు పెట్టుకోలేక అంత దూరం నడిచి వచ్చి ఫుడ్ డెలివరీ చేశాడు. "నాకు ఇంత మించి ఆప్షన్ లేదు. నా దగ్గర డబ్బుల్లేవు" అని చెప్పాడట. ఆ 30 ఏళ్ల వ్యక్తి పేరు సాహిల్ సింగ్. ECEలో గ్రాడ్యుయేషన్ చేసిన సాహిల్...నింజాకార్ట్‌లో పని చేశాడు. ఆ తరవాత బైజూస్‌లోనూ వర్క్ చేశాడు. కరోనా ప్యాండెమిక్ టైమ్‌లో తన సొంతూరైన కశ్మీర్‌కి వెళ్లిపోయాడు. ఆ తరవాత ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిలో చేరాడు. ఈ క్రమంలోనే ప్రియాన్షికి ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. బాగా అలిసిపోయి ఉన్న ఆ కుర్రాడిని ఏమైందని పలకరించింది. అప్పటికే మెట్లపై కూర్చుని ఆయాసపడుతున్నాడు సాహిల్ సింగ్. ఆ తరవాత పూర్తి వివరాలు కనుక్కుంది. వాటినే లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. వెంటనే అది వైరల్ అయిపోయింది. 


ఏం చెప్పాడు..? 


"మేడమ్. ట్రావెల్ చేయడానికి నా దగ్గర స్కూటర్ లేదు. ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా నాకు ఇవ్వలేదు. అందుకే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. మీకు ఆర్డర్ డెలివరీ చేయడానికి ఇంత దూరం  వచ్చాను. నా దగ్గ చిల్లిగవ్వ లేదు. మా ఫ్లాట్‌మేట్‌కి డబ్బులు అవసరం ఉన్నాయంటే ఇచ్చాను. నేను అబద్ధం చెబుతున్నానని మీకు అనిపించొచ్చు. కానీ...నేనే గ్రాడ్యుయేట్‌ని. నింజాకార్ట్‌, బైజూస్‌లో గతంలో పని చేశాను. ఈ ఆర్డర్‌ డెలివరీ చేస్తే నాకొచ్చేది రూ.20-25 మాత్రమే. వాళ్లిచ్చిన టైమ్‌లోగా మీకు డెలివరీ చేయాలి. ఇంతలో మరో డెలివరీ ఇస్తారు. అక్కడికీ వెళ్లాలి. నాకు బైక్ లేదు. సరిగ్గా తిని వారం రోజులైంది. టీ, వాటర్‌తో గడిపేస్తున్నాను. నాకోసం ఏదైనా జాబ్ ఉంటే చూడండి. కనీసం పాతికవేలు సంపాదించాలనుంది. నా వయసు 30 ఏళ్లు. మా అమ్మనాన్న పెద్దవాళ్లైపోతున్నారు. డబ్బు కోసం వాళ్లపైన ఆధారపడలేను"



ఈ పోస్ట్‌తో పాటు ఆ కుర్రాడి క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, మార్క్ షీట్స్, అడ్రెస్...ఇలా అన్ని వివరాలూ పోస్ట్ చేసింది ప్రియాన్షి. "ఆఫీస్ బాయ్, అడ్మిన్ వర్క్, కస్టమర్ సపోర్ట్..ఇలా ఎలాంటి జాబ్ ఉన్నా సరే దయచేసి చెప్పండి" అని రిక్వెస్ట్ చేసింది. ఈలోగా కొందరు నెటిజన్లు స్పందించి తనకు డబ్బు సాయం చేశారు. మరి కొంత మంది ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తరవాత సాహిల్‌కి ఉద్యోగం దొరికిందంటూ గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఆ మహిళ. మొత్తానికి ఈ పోస్ట్‌ తెగ వైరల్ అవుతోంది. 


Also Read: Millionaires Migration: ఇండియా నుంచి వేరే దేశాలకు వలస వెళ్తున్న మిలియనీర్లు, కారణమదేనట