Millionaires Migration:


6,500 మంది వలస..


ఇండియాలోని మిలియనీర్లంతా వలస వెళ్లిపోతున్నారట. హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ (Henley Private Wealth Migration Report 2023) వెల్లడించిన విషయమిది. దాదాపు 6,500 మంది మిలియనీర్లు ఇండియా నుంచి వెళ్లిపోనున్నట్టు నివేదిక అంచనా వేసింది. భారత్‌ని "సెక్యూర్డ్‌"గా ఫీల్ అవుతున్న సంపన్నుల సంఖ్య తగ్గిపోతోంది. తమ సంపద కరిగిపోకుండా కాపాడుకునేందుకు వేరే దేశాలకు వలస పోతున్నారు. మిలియనీర్లను కోల్పోతున్న దేశాల్లో తొలి స్థానంలో చైనా ఉంది. ఆ దేశంలో దాదాపు 13,500 మంది సంపన్నులు దేశం వదిలి వెళ్లిపోయారు. ఆ తరవాత అత్యధికంగా భారత్‌లోనే ఈ సమస్య ఎదురవుతోంది. అయితే...గతంలో దాదాపు 7,500 మంది మిలియనీర్లు వెళ్లిపోగా..ఈ సారి ఆ సంఖ్య వెయ్యి తగ్గి 6,500కి పరిమితమైంది. ఇది కాస్త ఊరట కలిగించినప్పటికీ...ఇండియాలో కొత్తగా మరికొంత మంది మిలియనీర్లుగా ఎదుగుతున్నారని చెబుతోంది ఈ నివేదిక. త్వరలోనే వీళ్లు మిలియనీర్ల లిస్ట్‌లో యాడ్ అవుతారని స్పష్టం చేసింది. కనీసం మిలియన్ డాలర్ల కంటే సంపద ఉన్న వాళ్లను మిలియనీర్లుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దశాబ్దకాలంగా మిలియనీర్ల వలసలు పెరుగుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2023-24లో కనీసం లక్షా 20 వేల మంది నుంచి లక్షా 28 వేల మంది మిలియనీర్లు ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు మైగ్రేట్ అయ్యే అవకాశముందని అంచనా వేసింది. ట్యాక్సేషన్ రూల్స్‌లో కఠినంగా ఉండటం, పెట్టుబడుల్లో సవాళ్లు ఎదురవడం లాంటి కారణాలు మిలియనీర్లు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. 


ఎక్కడికెళ్తున్నారు..?


ఇండియా నుంచి వెళ్లిపోతున్న మిలియనీర్లు ఎక్కువ మొత్తంలో ఆస్ట్రేలియాకు తరలిపోతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 5,200 మంది ఆస్ట్రేలియాకు వెళ్లినట్టు హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2022లో రికార్డు స్థాయిలో UAEకి వెళ్లారు. ఈ ఏడాది 4,500 మంది మైగ్రేట్ అయ్యారు. ఈ ఏడాది 3,200 మంది సింగపూర్‌కి తరలి వెళ్తారని అంచనా. అమెరికాకు 2,100 మంది మైగ్రేట్ అవుతారని రిపోర్ట్ తెలిపింది. ఆ తరవాత స్విట్జర్‌లాండ్, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. 


చైనా నుంచి కూడా..


చైనా బిలియనీర్లంతా సింగపూర్‌కు క్యూ కడుతున్నారు. తమ దేశంలోనే కొనసాగితే డబ్బుకి సేఫ్టీ ఉండదన్న అనుమానంతో అక్కడి నుంచి సింగపూర్‌కు వలస వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బిలియనీర్లపై ప్రత్యేక నిఘా పెడుతోంది. పదేపదే అనుమానిస్తోంది. ఈ టెన్షన్
తట్టుకోలేక దేశం వదిలి వెళ్లిపోతున్నారు. వీటితో పాటు జీరో కొవిడ్ పాలసీతో దేశం అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడే ఉండటం సేఫ్ కాదని భావిస్తున్నారు బిలియనీర్లు. ఒకరి తరవాత ఒకరు వరుసగా 
సింగపూర్‌కు టికెట్‌లు బుక్ చేసుకుంటున్నారు. కుబేరులంతా వస్తుంటే సింగపూర్‌ మాత్రం ఎందుకు కాదంటుంది. రెడ్ కార్పెట్ వేసి మరీ
వాళ్లను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సింగపూర్ మాత్రమే సేఫ్ అని అనుకుంటున్నారు బిలియనీర్లు. అక్కడ రాజకీయ అనిశ్చితి లేదు. 6 దశాబ్దాలుగా ఒకే ఒక పార్టీ రూల్ చేస్తోంది. లేబర్ స్ట్రైక్‌లు లేవు. వీధుల్లోకి వచ్చి గొడవలు చేయడమూ ఆ ప్రభుత్వం నిషేధించింది. అంటే...అల్లర్లకు ఆస్కారం ఉండదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం సింగపూర్‌లో ట్యాక్స్‌లు తక్కువ. బిలియనీర్ల రాకతో సింగపూర్‌లోని కాస్ట్‌లీ గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. థీమ్‌పార్క్‌లు, క్యాసినోలూ బిజీ అయిపోతున్నాయి. 


 Also Read: Trump Attacks Biden: బైడెన్‌కి ఓడిపోతానన్న భయం పట్టుకుంది, అందుకే ఈ తప్పుడు కేసులు - ట్రంప్ ఫైర్