Shirtless Officer:


యూపీలో ఘటన..


యూపీలో ఓ అధికారి మీటింగ్‌కి షర్ట్ లేకుండా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఆఫీసర్‌ కేవలం బనీన్ వేసుకుని ఆఫీస్‌కి వచ్చేశాడు. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడే సమయంలో ఇలా బనీన్‌తో దర్శనమిచ్చాడు. ఎంతో ముఖ్యమైన రివ్యూ మీటింగ్‌కి ఇలా వస్తారా..? అంటూ మండి పడ్డారు సీనియర్ అధికారులు. స్పెషల్ ప్రాజెక్ట్‌లపై డిస్కస్ చేసేందుకు మీటింగ్ పెట్టారు. ఆ అధికారి బనీన్‌తో వచ్చి కూర్చోవడం వల్ల మిగతా అధికారులంతా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ అధికారి ఏ జిల్లాకు చెందిన వాడు అన్నదీ స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటికే విద్యాశాఖ దీనిపై చాలా సీరియస్‌గా ఉంది. వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇంకెప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎన్ని రోజుల పాటు ఆ అధికారిని సస్పెండ్ చేస్తారన్నది తేలాల్సి ఉంది. 


పైలట్‌ల సస్పెన్షన్..


విమానం నడపడం అంత ఈజీ కాదు. ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటికప్పుడు కంట్రోల్‌ సెంటర్‌తో కమ్యునికేట్ అవ్వాలి. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నో గమనించుకోవాలి. ఇంత అప్రమత్తంగా ఉండాల్సిన పైలట్‌లు కాక్‌పిట్‌లో కూర్చుని విమానం నడుపుతూ స్నాక్స్ తింటే..? మరీ అంత నిర్లక్ష్యంగా ఉంటారా అన్న అనుమానం అక్కర్లేదు. ఈ ఏడాది మార్చిలో Spicejet ఎయిర్‌లైన్స్‌లో ఇదే జరిగింది. హోళి రోజున ఢిల్లీ నుంచి గువాహటికి వస్తున్న ఫ్లైట్‌లోని పైలట్‌లు కాఫీ, స్నాక్స్ తిన్నారు. అక్కడితో ఆగకుండా వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆలస్యంగా గ్రహించిన అధికారులు వెంటనే ఇద్దరి పైలట్‌లను విధుల నుంచి తొలగించారు. కాక్‌పిట్‌లో తినడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాక్‌పిట్‌లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచినా, వాటిని తిన్నా నేరంగానే పరిగణిస్తామని స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు. అందరూ ఈ రూల్‌ని కచ్చితంగా అనుసరించాలని అన్నారు. విచారణ పూర్తయ్యాక పైలట్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకూ వాళ్లను విధుల నుంచి తొలగించారు. కాఫీ గ్లాస్‌ను కన్సోల్‌పై ఉంచారని, ఒక్క చుక్క దానిపై పడినా ఎయిర్‌ క్రాఫ్ట్‌కు భారీ డ్యామేజ్ జరిగే ప్రమాదముందని వివరించారు స్పైస్‌జెట్ ప్రతినిధులు. దాదాపు 37 వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నప్పుడు ఇలాంటి సాహసాలు చేయడమేంటని మండి పడ్డారు.