ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటున్న రంగగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతిని బ్రెజిల్‌కు యువకుడు చంపేశాడు. బ్రాహ్మణపల్లికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్‌లో ఎంఎస్ చేస్తున్నారు. మిత్రులతో కలిసి ఉంటున్నారు. ఆమెపై రాత్రి బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమెతోపాటు ఫ్రెండ్‌పై కూడా నిందితుడు అటాక్ చేశాడు.
ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజస్విని చనిపోయారు. ఆమె స్నేహితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితమే తేజస్విని లండన్ వేళ్లారు.
నార్త్ లండన్‌లో మంగళవారం ఇద్దరు తెలుగు అమ్మాయిలపై దాడి జరిగింది. ఇందులో తీవ్ర గాయాలపాలైన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి స్పాట్‌లోనే చనిపోయారు. ఆమె స్నేహితురాలు 28 ఏళ్ల అఖిల గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జూన్ 13, మంగళవారం 09:59 గంటలకు వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఈ దాడి జరిగింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని అంబులెన్స్‌లో ఇద్దరి యువతులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం అఖిలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని చెప్పారు.
ఘటనా స్థలంలో 24 ఏళ్ల యువకుడు, 23 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే హత్య చేసి ఉంటారన్న అనుమానంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్న కాసేపటికే మహిళను ప్రశ్నించి వదిలేశారు.
మెట్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ నుంచి డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లిండా బ్రాడ్లీ మాట్లాడుతూ.." ఈ కేసులో చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. అరెస్టైన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అతడు తమ కస్టడీలోనే ఉన్నాడని ప్రశ్నిస్తున్నామని చెలిపారు.
"ఈ సంఘటన చాలా మందిలో ఆందోళన కలిగించిన విషయాన్ని గుర్తించామన్నారు. ఏమి జరిగిందో పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు డెడికేటెడ్ టీమ్‌లు పని చేస్తున్నాయని.. బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉంటారని ఇంకా ఏమైనా సమాచారం ఉంటే చెప్పాలని ప్రజలకు రిక్వస్ట్ చేశారు.