Telangana News :  డెక్కన్‌ క్రానికల్‌ మాజీ చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డిని ఈడీ అరెస్ట్‌ చేసింది. కెనరా బ్యాంక్‌, ఐడీబీఏ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో చర్యలు తీసుకున్నార.  వెంకట్రామ్‌రెడ్డితోపాటు మరో ఇద్దర్ని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  రూ. 8 వేల కోట్లతో బ్యాంకులను మోసం చేశారన్న కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ముందు సిబీఐ ఈ కేసులో దర్యాప్తు చేసింది. అనంతరం ఈడీ ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల నుంచి విచారించిన తర్వాత ఇవాళ అదుపులోకి తీసుకుంది.  బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని నిధులు మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీని ఆధారంగానే ఈడీ కేసు ఫైల్ చేసి ఎంక్వయిరీ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన 3300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసింది. 


ఇప్పటికే   పలు బ్యాంక్ ల నుండి రుణాలు తీసుకుని ఎగ్గొట్టినకేసులో  వెంకట్రామిరెడ్డిని గతంలోనే అరెస్ట్ చేసింది. రుణాలు తీసుకుని దారి మళ్లించడంతో పాటు చెల్లింపులు చేయకపోవడంతో  2015 లో సీబీఐని ఆశ్రయించింది కెనరా బ్యాంక్ ..  కెనరా బ్యాంక్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన సిబిఐ  విచారణ జరిపింది. వెంకట్రామిరెడ్డికి చెందిన అనేక ఆస్తులను సీజ్ చేసింది. డెక్కన్ క్రానికల్ పత్రికకు చెందిన రూ.  386 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది.  హైదరాబాద్ , ఢిల్లీ , బెంగళూరులో ఉన్న డెక్కన్ క్రానికల్ 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.  మొత్తం బ్యాంకుల నుండి రూ. 8180 కోట్లు రుణాలు పొందింది డెక్కన్ క్రానికల్ యాజమాన్యం. 


సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది.  సిబిఐ, సెబీ తో పాటు మొత్తం డెక్కన్ క్రానికల్ స్కాం పై 6 ఎఫ్ ఐ ఆర్  లు నమోదు అయ్యాయి.  వెంకట్ రాంరెడ్డి తో పాటు పికే అయ్యర్, ఆడిటర్ మని ఓమెన్ లను అరెస్ట్ చేసింది. ఈడీ విచారణకు వెంకటరామిరెడ్డి సోదరుడు వినాయక రవి రెడ్డి హాజరు కాలేదు. ఆయనను కూడా ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.  విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేసినట్టు ఈడీ చెబుతోంది.  అరెస్టు చేసిన ముగ్గురికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఈడీ కోర్టులో హాజరు పరిచారు.  


డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి .. మొదట్లో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ క్రికెట్ టీం కూడా ఉండేది. ఈ టీం కోసం .. పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని దారి మళ్లించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి వెంకట్రామిరెడ్డి కేసుల్లో ఇరుక్కోవడంతో .. బీసీసీఐ ... డెక్కన్ చార్జర్స్  ఫ్రాంచైజీని క్యాన్సిల్ చేసింది. దీంతో వెంకట్రామిరెడ్డి మరింత నష్టపోయారు. చివరికి ఫ్రాంచైజీ .. చె్న్నైకు చెందిన సన్ నెట్ వర్క్ దక్కించుకుని.. హైదరాబాద్ సన్ రైజర్స్ అని పేరు మార్చింది.