Power Cut Season : దేశవ్యాప్తంగా గత రెండు నెలల కాలంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభాన్ని ఎవరూ మర్చిపోరు. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడుతోంది కాబట్టి డిమాండ్ తగ్గి సాధారణ స్థితి వస్తోంది కానీ ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ( CREA ) రూపొందించిన తాజా నివేదికలో ఇదే విషయాన్ని వెల్లడించారు. జూలై- ఆగస్టు నెలల్లో దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక పేర్కొంది.
ఢిల్లీ ఆరోగ్య మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ - హవాలా కేసులో ఇరుక్కున్న కేజ్రీవాల్ మంత్రి !
ముందుచూపుతో బొగ్గును నిల్వ చేసుకోకపోవడమే దీనికి కారణమని సీఆర్ఈఏ చెబుతోంది. నివేదిక ప్రకారం... రుతుపవనాల కారణంగా బొగ్గు తవ్వకాల విషయంలో అవాంతరాలు ఏర్పడవచ్చు. వర్షాలు, వరదలు వస్తే రవాణా, పంపిణీలో కూడా సమస్యలు తలెత్తుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని... రుతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను పవర్ ప్లాంట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
బీజేపీకి షాక్ ఇచ్చిన నితీష్ - ఆ కేంద్రమంత్రి రాజీనామా తప్పదు !
దేశంలో ఏమాత్రం విద్యుత్తు వినియోగం పెరిగినా థర్మల్ కేంద్రాలు భరించే స్థితిలో లేవు అని సీఆర్‌ఈఏ తన నివేదికలో పేర్కొన్నది. దేశంలో బొగ్గు ఉత్పత్తికి లోటు లేదని కానీ థర్మల్ ప్లాంట్లకు బొగ్గును చేరవేయడంపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇటీవల విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నది. ఆగస్టులో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 214 గిగావాట్లకు చేరవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ( CEA ) అంచనా వేస్తున్నది.
బెంగళూరులో రాకేష్ టికాయత్ పై దాడి - మొహంపై సిరా చల్లిన ఆందోళనకారులు !
ఇటీవల విద్యుత్ సంక్షోభం కారణంగా దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రాష్ట్రాలు మినహా పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ విద్యుత్ కోతలు అమలు చేయక తప్పలేదు. బొగ్గు కొరత ఎక్కువగా ఉండటంతో కేంద్రం కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించింది. అయితే ధర మరీ ఎక్కువ కావడంతో ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేలకపోతున్నాయి. దేశంలో బొగ్గు రవాణా కూడా సమస్యగా మారింది. వర్షా కాలంలోనూ కరెంట్ కష్టాలు వస్తే.. ఆర్థిక వ్యవస్థకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.