వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్గ కాలం పోరాడిన రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్‌బై బెంగళూరులో దాడి జరిగింది. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా దూసుకొచ్చిన ఆందోళనకారులు... ఆయనపై దాడి చేసి మొహంపై సిరా చల్లారు. 






టికాయత్‌పై ఇంక్ చల్లిన తర్వాత ఆందోళనకారులు సమావేశం జరుగుతున్న హాల్‌లో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు.  కుర్చీలన్నీ విరగ్గొట్టేశారు. ఆ సమయంలో ఒక్కపోలీసు అధికారి కూడా లేరు. 



ఇది కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల పనేనని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ఎలాంటి భద్రత కల్పించలేదని టికాయత్ వ్యాఖ్యానించారు.  







దేశంలో అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా తిరుగుతున్నామని.. అదే డిమాండ్‌తో తాము బెంగళూరులో సమావేశం నిర్వహిస్తున్నామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదంతా ప్రభుత్వ మద్దతుతోనే జరిగిందని.. వారు ఆరోపిస్తున్నారు.ఆందోళనకారులంతా మోదీ.. మోదీ నినాదాలు చేస్తూ దాడులకు దిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదే విధంగా వారు మోదీ పోస్టర్లు తీసుకొచ్చారని తెలుస్తోంది. టికాయత్ సమావేశంలో పాల్గొన్న కొంత మందిరైతులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. 





రైతుల కోసం ఉద్యమాలు చేసిన టికాయత్‌పై యూపీలోనూ ఇలాంటిదాడి జరగలేదు. అయితే ఢిల్లీ రైతు ఉద్యమానికి పెద్దగా స్పందించని కర్ణాటకలో దాడి జరగడం రాజకీయంగానూ కలకలం రేపుతోంది.