Chandrayaan-3 Mission: 


కౌంట్‌డౌన్ మొదలు..


చంద్రయాన్ 3 మిషన్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కౌంట్‌డౌన్ కూడా మొదలైంది. జులై 14న మధ్యాహ్నం 2.35 నిముషాలకు మిషన్ లాంఛ్‌ కానుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. అయితే...ఈ లాంఛ్‌ని స్పేస్ థీమ్ పార్క్‌లోని వ్యూయింగ్ గ్యాలరీ నుంచి చూడొచ్చు. ఇందుకోసం టికెట్‌లు కూడా విక్రయించారు. ఈ రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి కూడా. మరి ఈ ప్రయోగాన్ని లైవ్‌లో చూడాలనుకుంటే ఎలా..? శ్రీహరికోట వరకూ వెళ్లాల్సిందేనా..? అదేమీ అవసరం లేదు. ఇండియాలో మరి కొన్ని కీలక కేంద్రాల్లోనూ ఈ ప్రయోగాన్ని లైవ్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేశారు. 


ఎక్కడెక్కడ చూడొచ్చు..? 


పులికాట్ బర్డ్ సాంక్చుయరీ (Pulicat Bird Sanctuary)కి సమీపంలోని అత్తకనితిప్ప వ్యూ పాయింట్ నుంచి ఈ లాంఛింగ్‌ని చూసే అవకాశముంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి లాంఛింగ్‌ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. వ్యూ గ్యాలరీ నుంచి ఇది 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ CISF సెక్యూరిటీ చెక్‌పాయింట్ ఉంటుంది. పాస్‌ ఉంటే సులువుగా లోపలకి వెళ్లిపోవచ్చు. ఇక ఈ లాంఛ్‌కి సంబంధించిన ప్రతి మొమెంట్‌ని కెమెరాల్లో బంధించాలనుకునే వాళ్లకూ ఓ మంచి స్పాట్ ఉంది. పులికాట్ బర్డ్ సాంక్చుయరీ నుంచి వెనాడుకి (Venadu) వెళ్లాల్సి ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ప్రతి ఒక్క మొమెంట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 


స్పేస్ థీమ్ పార్క్‌లో ఏముంటాయి..? 


స్పేస్ థీమ్ పార్క్‌లోని రాకెట్ గార్డెన్ హైలైట్. ఇస్రోకి సంబంధించిన సౌండింగ్ రాకెట్, SLV,PSLV,GSLV లాంటి ఐకానిక్ లాంఛ్ వెహికిల్స్‌కి సంబంధించిన ఫొటోలు ఇక్కడే ఉంటాయి. ఇక లాంచ్ వ్యూ గ్యాలరీలో వేలాది మంది ప్రేక్షకులు లైవ్‌లో లాంఛింగ్‌ని చూసే వీలుంటుంది. స్పేస్ మ్యూజియమ్‌లో ఇండియన్ స్పేస్‌ ప్రోగ్రామ్ చరిత్ర అంతా ఉంటుంది. టెక్నాలజీ, అప్లికేషన్స్‌కి సంబంధించిన కీలక వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన వాళ్లు స్పేస్ థీమ్ పార్క్‌లోని వ్యూ గ్యాలరీ నుంచి చంద్రయాన్ 3 లాంఛింగ్‌ని లైవ్‌లో చూసేయొచ్చు. 


చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3ని ఛాలెంజ్‌గా తీసుకుంది ఇస్రో. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావాలని వెంకన్న స్వామిని కోరుకున్నారు. చంద్రయాన్‌ 3కి సంబంధించిన మినియేచర్ మోడల్‌ని తమతో పాటు తీసుకొచ్చారు. వెంకన్న సన్నిధిలో ఉంచి ప్రార్థనలు చేశారు. మొత్తం 8 మంది సైంటిస్ట్‌లు తిరుపతి బాలాజీని సందర్శించుకున్నారు. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీ చెంగలమ్మ ఆలయం వద్ద ప్రార్థనలు చేశారు. అనుకున్నట్టుగా ఈ మిషన్ సక్కెస్ అవ్వాలని, చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని కోరుకున్నారు. గతంలో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రయాన్ -3 ని ఫెయిల్యూర్ బేస్ట్ అప్రోచ్ తో అభివృద్ధి చేశామని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2 ను సక్సెస్ బేస్డ్ మోడల్ లో రూపొందించారు.


Also Read: Tesla in India: త్వరలోనే ఇండియాలో టెస్లా ఈవీ ఫ్యాక్టరీ! ఒక్కో కారు రూ.20 లక్షలు!