ప్రేమ గుడ్డిదంటారు కానీ.. ఆ ఎలక్ట్రిషియన్‌కు మాత్రం ప్రేమ చీకట్లోనే దొరుకుతుందని కనిపెట్డాడు. ఆ ఎలక్ట్రిషియన్ ప్రేమికురాలు కూడా అదే బాపతు. అందుకే కరెంట్ పోయినప్పుడల్లా చీకట్లో కలుసుకునేవారు. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంట్ పోయేది. అదేదో సినిమాలో చెప్పినట్లుగా ప్రేమ పవర్ ఫుల్.. స్వచ్చమైన ప్రేమ అయితే ఎప్పుడు ఏం చేయాలంటే అది జరుగుతుందన్నట్లుగా వీరి వ్యవహారంలోనూ కలుసుకోవాలనుకున్నప్పుడల్లా కరెంట్ పోయేది. కానీ అసలు ట్విస్ట్ మాత్రం వేరే ఉంది. అది బయటపడేసరికి ఆ ప్రేమికుడ్ని గ్రామస్తులు చితకబాది ఆ ప్రేమికురాలితో పెళ్లి చేసేశారు., 


మస్క్ కంటే ముందే పరాగ్ బ్యాటింగ్ - వాళ్లని ఇంటికి పంపేస్తున్నారు !


బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని గణేశ్‌పూర్‌ గ్రామంలోని ప్రజలు తరచూ కరెంట్‌ కోతలతో బాధపడుతున్నారు. ఎప్పుడూ కరెంటు కోతలేరుగని గ్రామస్తులు.. ప్రతిరోజూ కరెంట్‌ పోవడంతో వారెన్నో ఇబ్బందులనెదుర్కొన్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాలకు కరెంట్‌ సమస్యలు లేవు. దీంతో అసలు సమస్య ఎక్కడొస్తుంది? ఎందుకొస్తుంది? ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవాలని గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయాకొచ్చారు. అందులో భాగంగా ఆ ఊరి ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలుపెట్టారు. 


ఆఫీసుకు రమ్మంటున్నారని రాజీనామా చేసేశారు - ఆ కంపెనీకి ఉద్యోగుల మూకుమ్మడి రిజైన్ !


ఇలా నిఘా పెట్టిన సమయంలో ఓ వ్యక్తి స్తంభం ఎక్కడం.. కరెంట్ తీయడం.. ఆ తర్వాత ఎక్కడికో వెళ్లడం.. ఓ గంట, అరగంట తర్వాత వచ్చి మళ్లీ కరెంటివ్వడం జరుగుతున్నాయి. కనిపెట్టిన గ్రామస్తులు అతన్ని పట్టుకుని ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎవరంటే అతను ఆ ఊరిలో ఉండే ఎలక్ట్రిషియనే. కరెంట్ తీసి ఏం చేస్తున్నాడా అని ఆరా తీస్తే ఊళ్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నడాట..  తాను ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు కరెంట్‌ తీసి చీకట్లో వెళ్లి కలసి వచ్చేవాడట. ఆ విషయం తెలిసి ఆ ఎలక్ట్రిషియన్ని చితకబాది పంచాయతీ పెట్టారు. 


అమిత్ షాను కలిసిన కేఏ పాల్, కొత్త డిమాండ్లతో ముందుకు! భవిష్యత్తులో అలా ఉంటుందంటూ హెచ్చరిక


 ఆ ఎలక్ట్రిషియన్‌ని చితక్కొట్టి మరీ ఆ గ్రామంలో ఊరేగించారు.గ్రామస్తులందరూ తమకు కరెంట్ కోతల బాధలు తప్పాలంటే వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామస్తులు, సర్పంచ్‌, గ్రామ కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలో వివాహం జరిపించారు. అయితే ఎలక్ట్రిషియన్‌ చేసిన పనికి గ్రామస్తులు ఫిర్యాదు చేయలేదని, చేస్తే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కానీ గ్రామస్తులు మాత్రం పెళ్లితో సమస్య పరిష్కారం అయిందని ఊరుకున్నారు.