కరోనా పని అయిపోయింది.. ఆఫీసులకు రండి అని కంపెనీలు పిలుస్తున్నాయి. తాము ఉద్యోగం అయినా మానేస్తాం కానీ ఆఫీసులకు రానే రామని ఉద్యోగులు అంటున్నారు. ఇది ఉత్తుత్తి బెదిరింపులు కాదు. నిజంగానే వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా వైట్‌హ్యాట్ జూనియర్ ( Whitehate Jr ) సంస్థకు చెందిన సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌ను నిలిపివేసి .. ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించడంతో వీరంతా స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.
రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ
వైట్ హ్యాట్ జూనియర్ ఎడ్యూకేషన్ టెక్ సంస్థ బైజూస్ ( Byjus ) అనుబంధ సంస్థ. వైట్ హ్యాట్ జూనియర్‌ని 2020లో 300 మిలియన్ డాలర్లతో బైజుస్ కొనుగోలు చేసింది. మార్చి 18న వైట్‌హ్యాట్ తన ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో జూనియర్ ముంబయి, బెంగళూరు, గురుగ్రామ్‌లలో ఉన్న ఉద్యోగులు నెలలోపు కార్యాలయాలకు హాజరుకావాలని సందేశం పంపింది. అందరూ ఆఫీసులకు వస్తారని వైట్ హ్యాట్ జూనియర్ యాజమాన్యం అనుకుంది. కానీ వారు ఆఫీసులకు రావాల్సిన రోజున.. వారంతా రాజీనామాలు పంపినట్లు సమాచారం. మరిన్ని రాజీనామాలు వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలుభావిస్తున్నాయి. వైట్‌హ్యాట్ సంస్థను బైజుస్ కొనుగోలు చేయడం, వ్యవస్థాపకుడు కరణ్‌బజాజ్ బాధ్యతల నుండి తప్పుకోవడంతో సంస్థలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఎక్కువ మంది ఉద్యోగులు భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలుచెబుతున్నాయి.
'ఒక పార్టీ, ఒకే టికెట్'పై కాంగ్రెస్ కీలక నిర్ణయం- హాట్‌హాట్‌గా 'చింతన్ శివిర్' సమావేశం
ఇటీవల దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని పిలుస్తున్నాయి. అయితే ఎక్కువ మంది వచ్చేందుకు ఇష్టపడటం లేదు. యాపిల్ ( Apple ) ఉద్యోగులు కూడా వారానికి మూడు రోజులు కార్యాలయాల నుండి పనిచేయాలన్న కంపెనీ ఆదేశాల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 76 శాతం మంది ఉద్యోగులు కంపెనీ రిటర్న్ టు వర్క్ విధానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. కారణాలు ఏమైనా ఇంట్లో ఉద్యోగాలు చేయడం మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తిగా అలవాటు పడిపోయారని అందుకే ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు సిద్ధంగా లేరన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఆత్మ పరిశీలనా? ఆత్మస్తుతా? నేటి నుంచే మూడు రోజులపాటు కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ సభలు