ABP  WhatsApp

PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ

ABP Desam Updated at: 13 May 2022 02:40 PM (IST)
Edited By: Murali Krishna

PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశాను కదా అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ

NEXT PREV

PM Modi: 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిని మారుస్తుందని కొన్ని ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేశాను కదా అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని మోదీ అన్నారు.







చాలామందిలా చాలిక అని అనుకోను. పెద్ద లీడరు ఒకాయన ఒకరోజు నన్ను కలిశారు. రాజకీయాల్లో నన్ను నిత్యం విమర్శించే ఆయనను వ్యక్తిగతంగా నేను గౌరవిస్తా.  కొన్ని అంశాలు రుచించకపోవడంతో ఆయన నా వద్దకు వచ్చారు. మా భేటీలో ఆయన ఒక సలహా ఇచ్చారు "దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకుంది. ఇంకా నీకు ఏం కావాలి?" అని అడిగారు. రెండుసార్లు ప్రధానిగా చేస్తే, జీవితంలో అన్నీ పొందినట్టేనన్న భావం ఆ నేత మాటల్లో వ్యక్తమయింది. అయితే.. మోదీ మిగతా నేతలకు భిన్నమని, గుజరాత్‌ నేలే నాకు ఆ ప్రత్యేకతను ఇచ్చిందని  ఆయనకు తెలియదు. "అయిందేదో అయింది.. ఇక అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుందాం" అనుకునే రకం నేను కాదు. పథకాలు వందశాతం అమలై, పూర్తి సంతృప్తికర స్థాయికి ప్రజలను చేర్చాలనేదే నా కల. అప్పటివరకు విశ్రమించేది లేదు. సంతృప్తి పడి సరిపెట్టుకునే తత్వం కాదు నాది. రెండుసార్లు ప్రధాని అయ్యా కదా అని సరిపెట్టుకోను.                                                                            - ప్రధాని నరేంద్ర మోదీ 


అయితే సదరు నేత పేరు మోదీ ప్రస్తావించకపోయినా ఆ సలహా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ ఇచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


కార్యక్రమం





గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో మోదీ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, విధి వంచిత పౌరులను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన పథకాలను వందశాతం అమలుచేసిన సందర్భంలో బరూచ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు వందశాతం అమలయ్యేలా చూడాలన్నదే ఒక నేతగా తన కల అని మోదీ అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 






Also Read: Chhattisgarh Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి


Also Read: Coronavirus Update: దేశంలో కొత్తగా 2,841 కరోనా కేసులు- 9 మంది మృతి

Published at: 13 May 2022 12:34 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.