Delhi Traffic Violations:
ఢిల్లీలో పరిస్థితి ఇదీ..
ఢిల్లీలో 20 వేల కార్లకు 100కి పైగా చలానాలు ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆ కార్ ఓనర్స్ ఇప్పటి వరకూ ఒక్క చలానా కూడా కట్టలేదు. 20,684 కార్‌లు ట్రాఫిక్‌ని ఉల్లంఘించాయని, ఒక్కో కార్‌పై 100కి పైగా చలానాలు ఇష్యూ చేశారు. 1.65లక్షల వెహికిల్స్‌కి 20కి పైగా చలానాలు జారీ అయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు వెహికిల్ ఓనర్స్. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఏడాది జూన్ 30 నాటికి 58 లక్షల వాహనాలపై 2.6 కోట్ల చలానాలు ఉన్నాయి. దీనిపై ట్రాఫిక్ పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాశారు. తక్షణమే ఈ వెహికిల్ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేయాలని కోరారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన వాహనాల్లో కొన్ని వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినవీ ఉన్నాయి. అందుకే...ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఇదే లేఖ పంపారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటి వరకూ 2.6 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 1.65 లక్షల వాహనాలపై 67 లక్షల చలానాలున్నాయని తెలిపారు. అంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ వయలేషన్ జరుగుతోందో అర్థమవుతోంది. గతేడాది కూడా ఢిల్లీలో రికార్డు స్థాయిలో చలానాలు జారీ అయ్యాయి. ఏకంగా 14 లక్షల ట్రాఫిక్ వయలేషన్స్ నమోదయ్యాయి. 2021లో ఇది 18 లక్షలుగా ఉంది. ఈ సారి ఆర్నెల్లలోనే 6.30 లక్షల వయలేషన్స్ నమోదయ్యాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే...ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
ఒకే వ్యక్తికి 70 చలానాలు..
యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 70 చలానాలు విధించారు. ఏడాదిన్నరలో 70 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించాడా వ్యక్తి. ఈ చలానాలన్నీ కలిపి రూ.70,500 వరకూ ఉన్నాయి. అతని బైక్ వాల్యూ రూ.85 వేలు. అంటే..దాదాపు బైక్ ధర అంత ఉన్నాయి కట్టాల్సిన చలానాలు. ఈ ఏడాది ఇప్పటికే 33 చలానాలు రాగా, గతేడాది 37 చలానాలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. సిటీలో అందరి కన్నా ఎక్కువగా చలానాలున్న వెహికిల్స్ వివరాలు వెల్లడించారు. అందులో అత్యధికంగా 70 చలానాలతో ఓ వ్యక్తి టాప్‌లో నిలిచాడు. మిగతా 9 మంది పేరిట కూడా భారీగానే ఫైన్‌లున్నాయి. ఒక్కొక్కరు కనీసం 50 సార్లు రూల్స్ అతిక్రమించినట్టు పోలీసులు వెల్లడించారు. జంక్షన్‌ల వద్ద ట్రాఫిక్ కెమెరాలూ ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలో భాగంగా వీటిని అమర్చారు. అయితే...ఈ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించిన వాహనాల నెంబర్ ప్లేట్స్‌ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తాయి. ఆటోమెటిక్‌గా చలానాలు జనరేట్ అవుతాయి. ఇప్పటికే వీరందరికీ నోటీసులు ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. వెంటనే ఈ ఫైన్ కట్టకపోతే వెహికిల్స్‌ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అక్కడే కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వాహనదారులు చలాన్లు కట్టకుండా వదిలేస్తున్నారు. పెండింగ్ చలాన్లు కట్టకుండా ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకునే వారికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఝలక్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మూడు నెలల్లో రెండు, మూడు ఉల్లంఘనలకు పాల్పడితే రెండింతలు, మూడింతలు జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ లేని ప్రయాణం, రాంగ్ రూట్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి వాటికి విధిస్తున్నారు.
Also Read: Chamoli Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి