Chamoli Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం, ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి

Chamoli Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందారు.

Continues below advertisement

Chamoli Accident: 

Continues below advertisement

ఉత్తరాఖండ్‌లోని చమోలీలో ఘోర ప్రమాదం జరిగింది. అలకనంద నదీ తీరంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్‌తో చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. నమామి గంగే ప్రాజెక్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

"చమోలి జిల్లాలోని అలకనంద నదీ తీరంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. ఈ ఘటనలో 10 మంది విద్యుత్‌ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించాం"

- పరమేంద్ర దోవల్, చమోలి ఎస్‌పీ 

Continues below advertisement