దేశ రాజధాని దిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. రాజధానిలో ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని యూపీ పోలీసుల నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.







దిల్లీ ప్రత్యేక పోలీస్ సెల్‌కు ఓ అనుమానాస్పద ఈ మెయిల్ వచ్చింది. దీనిపై వాళ్లు యూపీ పోలీసులను సమాచారం కోరగా.. అది ఓ ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చినట్లు తెలిపారు.  సంస్థ పేరు తెహ్రిక్-ఈ- తాలిబన్‌గా గుర్తించారు. ఈ మెయిల్ వివారాలను దిల్లీ పోలీసులకు అందించారు.


దిల్లీ సరోజిని నగర్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రతా ముప్పు కారణంగా ఈ మార్కెట్‌ను మూసివేయించారు. మార్కెట్ అణువణువునా పోలీసులు గాలింపు చేపడుతున్నారు.


మరోవైపు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో ఇది మొదటి బెదిరింపు ఏం కాదు. దిల్లీలోని ఘాజీపుర్, సీమాపురి ప్రాంతాల్లో ఇంతకుముందు దిల్లీ పోలీసులకు రెండు ఐఈడీలు దొరికాయి.


అప్పుడు కూడా


రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత ప్రధానిపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ గట్టి హెచ్చరికలు చేసింది. గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి.  ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే కాదని.. పలువురు ప్రముఖులపై దాడికి టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లుగా ఇంటెలిజెన్స్ నివేదిక కేంద్ర హోంశాఖకు చెప్పినట్లు తెలిసింది.


వీటిపై వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. రిపబ్లిక్ డే రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడింది. అయితే తాజాగా మరోసారి అలాంటి బెదిరింపులే వచ్చాయి.


Also Read: No Toll Tax Within 60 km: వాహనదారులకు గుడ్ న్యూస్, హైవేలపై 60 కి.మీటర్ల పరిధిలో టోల్ టాక్స్ కట్టక్కర్లేదు!


Also Read: Money Laundering Case: మొన్న మేనల్లుడు, నేడు బావమరిది- సీఎంలు మారారంతే, సీనంతా సేమ్ టూ సేమ్