ప్రతిపక్షాల ముఖ్యమంత్రులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుస షాక్‌లు ఇస్తోంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బావమరిదికి సంబంధించిన 6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది.







ఠాక్రే బావమరిది శ్రీధర్ మాధవ్ పట్నాకర్‌కు చెందిన రూ.6.45 కోట్ల విలువైన చరాస్తులను ఈడీ సీజ్ చేసింది. వీటితో పాటు ఠాణెలో పట్నాకర్‌కు చెందిన నీలాంబరీ ప్రాజెక్టులో ఉన్న 11 ఫ్లాట్లను కూడా సీజ్ చేసింది.


మొన్న పంజాబ్


ఇటీవల చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాల కేసులో మనీలాండరింగ్ ఆరోపరణలపై భూపేందర్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.


ఈ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ.. భూపేందర్‌ను తమ కార్యాలయానికి పిలిచి కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది. జనవరి 23నే భూపేందర్‌ను ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఆరోగ్య కారణాలు చెప్పి భూపేందర్ హాజరకుకాలేదు. ఆ తర్వాత హాజరుకాగా ఈడీ అరెస్ట్ చేసింది.


ఈడీ దాడులు..


చన్నీ మేనల్లుడు అయిన భూపిందర్‌ సింగ్‌ హనీ.. పంజాబ్‌ రియల్టర్స్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడం వల్ల ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. ఆయనకు చెందిన పలు ఇళ్లపై జనవరి 18న ఈడీ దాడులు జరిపింది ఈడీ. రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.


Also Read: Court Notice To Lord Shiva : దేవుడిపై కబ్జా కేసు - పైగా రూ. పదివేలు ఫైన్ వేస్తామని వార్నింగ్ ! ఇప్పుడు దేవుడికి దారేది?


Also Read: West Bengal: బయట తాళం వేసి, ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు- 8 మంది సజీవ దహనం