Delhi Air Pollution:
మెరుగు పడిన గాలి నాణ్యత..
Delhi Pollution Updates: ఢిల్లీ కాలుష్య స్థాయి (Pollution in Delhi) కొంత మేర తగ్గింది. ఎయిర్ క్వాలిటీ కాస్త (Delhi Air Quality) మెరుగు పడినట్టు అధికారులు వెల్లడించారు. "Severe" నుంచి "Very Poor" కి చేరుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలను కొంత తగ్గించింది. ఆంక్షలను సవరించింది. కొద్ది రోజులుగా డీజిల్ వాహనాలు సిటీలోకి ఎంటర్ కాకుండా నిషేధం విధించింది. ఇప్పుడీ బ్యాన్‌ని ఎత్తివేసింది. వేగమైన గాలులు వీస్తున్న కారణంగా కాలుష్యం తగ్గింది. అందుకే...డీజిల్ వెహికిల్స్‌నీ సిటీలోకి అనుమతించేందుకు అంగీకరించింది ప్రభుత్వం. ఇవాళ్టి లెక్కల ప్రకారం (నవంబర్ 18) సాయంత్రం 4 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ 317గా నమోదైంది. అంతకు ముందు రోజు ఇది 405గా నమోదైంది. ఘజియాబాద్‌లో 274, గుడ్‌గావ్‌లో 346, గ్రేటర్ నోయిడాలో 258, నోయిడాలో 285, ఫరియాబాద్‌లో 328గా రికార్డ్ అయింది. ఈ క్రమంలోనే Commission for Air Quality Management (CAQM) కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య కట్టడికి ఉద్దేశించిన Graded Response Action Plan (GRAP)స్టేజ్ -4 ఆంక్షల్ని ఎత్తివేసింది. అయితే..స్టేజ్-1 నుంచి స్టేజ్ 3 వరకూ విధించిన ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. నవంబర్ 5వ తేదీన స్టేజ్ 4 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆ సమయంలోనే డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఇకపై మీడియం, హెవీ గూడ్స్ వెహికిల్స్‌ని సిటీలోకి అనుమతించనుంది. IIT కాన్పూర్ స్పెషల్ టీమ్...ఇటీవలే కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీలో డీజిల్ వెహికిల్స్ (Delhi Diesel Vehicles) కారణంగానే 45% మేర కాలుష్యం నమోదవుతోందని తేల్చి చెప్పింది. వాహనాల నుంచి పొగ కారణంగా గాల్లోకి సల్ఫేట్, నైట్రేట్ ఎక్కువగా విడుదలవుతాయి. అందుకే...డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించింది.
ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు..
కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాల మేరకు గురువారం ఈ ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం నిబంధనలను అమలు చేయడం, పర్యవేక్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోనుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలోఇప్పటికే రెండు స్మోక్ టవర్లు ఏర్పాట్లు చేశారు. అయితే అవి నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా, ఈ జెయింట్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ల నిర్వహణ ఖర్చుతో కూడుకుందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 4ని అమలు చేసినప్పటికీ, దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిందని తెలిపింది. గత బుధవారం ఢిల్లీలో 23 శాతం వాయు కాలుష్యానికి వ్యవసాయ వ్యర్థాలను కాల్చడమేనని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ పేర్కొంది.