CEO Mira Murati: డీప్‌ఫేక్ వీడియోలపై ChatGPT కొత్త సీఈవో కీలక వ్యాఖ్యలు, ఏమన్నారంటే?

CEO Mira Murati: డీప్‌ఫేక్ వీడియోలపై చాట్‌జీపీటీ కొత్త సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

CEO Mira Murati on Deepfake: 

Continues below advertisement

చాట్‌జీపీటీ సీఈవోగా మీరా..

ఏడాది క్రితం వరకూ చాట్‌జీపీటీ (ChatGPT) అనే ఓ టెక్నాలజీ ఉంటుందని ప్రపంచానికి తెలియదు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ జోరందుకుందో అప్పుడే చాట్‌జీపీటీ వెలుగులోకి వచ్చింది. Open AI సంస్థ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ దెబ్బతో OpenAI కంపెనీ పేరు కూడా మారుమోగింది. ఇప్పుడు మరోసారి చాట్‌జీపీటీ గురించి చర్చ జరుగుతోంది. అందుకు కారణం...చాట్‌జీపీటీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ని (Sam Altman Sacked) తొలగించడం. ఆయన స్థానంలో మీరా మురతిని ( Mira Murati) నియమించింది కంపెనీ బోర్డ్. చాట్‌జీపీటీతో పాటు Dall-E మోడల్‌నీ ప్రమోట్ చేసే బాధ్యతలు తీసుకున్నారు మీరా. డీప్‌ఫేక్‌ వీడియోలు సంచలనం సృష్టిస్తున్న ఈ కీలక సమయంలో CEO మారడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా డీప్‌ఫేక్‌ టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. AI,ChatGPT ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ కొత్త సీఈవో మీరా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టెక్నాలజీలను వినియోగించి ఇలా వీడియోలను మార్ఫింగ్ చేయడంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. కచ్చితంగా ఇలాంటి వీడియోలను కట్టడి చేస్తామని తేల్చి చెప్పారు. 

"AI టెక్నాలజీని వినియోగించి ఇలా డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం ఆందోళనకరమైన విషయం. కచ్చితంగా దీనిపై దృష్టి పెడతాం.  Dall-E అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. కానీ దుర్వినియోగం చేయకుండా కట్టడి చేస్తాం. AI టెక్నాలజీతో మనం ఎన్ని అద్భుతాలు చేయగలమో చెప్పడమే మా ఉద్దేశం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదని అనిపిస్తోంది. ప్రముఖులకు సంబంధించిన ఏ అభ్యంతరకర వీడియోలనైనా సరే తొలగిస్తున్నాం. ఆ డేటాని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఆడిటింగ్ చేపడతాం. ఆ తరవాత క్రమంగా ఫిల్టర్‌లు అప్లై చేసేలా మార్పులు చేర్పులు చేస్తాం. ఇలాంటి వీడియోలు జనరేట్‌ కాకుండా అడ్డుకునేలా చేస్తాం"

- మీరా మురతి, చాట్‌జీపీటీ సీఈవో 

మోదీ తీవ్ర అసహనం..

డీప్‌ఫేక్‌ టెక్నాలజీపై (Deepfake Technology) ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనిపై ఇప్పటికే ChatGpt టీమ్‌తో మాట్లాడినట్టు వెల్లడించారు. డీప్‌ఫేక్‌ టెక్నాలజీని (Deep Fake Technology) సీరియస్‌గా తీసుకోవాలని, అలాంటి వీడియోలను సర్క్యులేట్ చేసిన వాళ్లకి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు ప్రధాని. టెక్నాలజీని కాస్త బాధ్యతగా వినియోగించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. 

"ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇలాంటి సమయంలో టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదు. సరైన విధంగా దీన్ని వాడుకోవాలి. మీడియా కూడా ప్రజల్లో ఈ టెక్నాలజీపై అవగాహన కల్పించాలి"

- ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Uttarakhand Tunnel Rescue: 150 గంటలు గడిచినా శిథిలాల కిందే కార్మికులు, వర్టికల్ డ్రిల్లింగ్‌ ఆప్షన్ వర్కౌట్ అవుతుందా?

Continues below advertisement