Uttarakhand Tunnel Rescue Opeartion:
150 గంటలు...
ఉత్తరాఖండ్ సొరంగంలో (Uttarakhand Tunnel Rescue) చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి 150 గంటలు గడిచినా ఇంకా వాళ్లను బయటకు తీసుకొచ్చే దారి దొరకడం లేదు. అమెరికా నుంచి స్పెషల్ మెషీన్ తెప్పించి మరీ డ్రిల్లింగ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది చాలానే శ్రమిస్తున్నారు. మెషీన్‌లో సమస్య కారణంగా కాసేపు రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయింది. మెషీన్ విరిగిన చప్పుడు గట్టిగా వినిపించడం వల్ల సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆపరేషన్‌ని నిలిపివేసింది. తరవాత వెంటనే మరో భారీ డ్రిల్లింగ్ మెషీన్‌ని (Uttarakhand Tunnel Collpase) తెప్పించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఆందోళనకు లోను కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. పైప్‌ల ద్వారా ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. ఘటనా స్థలానికి ప్రధాన మంత్రి కార్యాలయం (PM Ofiice) డిప్యుటీ సెక్రటరీ మంగేశ్ ఘిల్దియాల్ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయిన కాసేపటికే ఆయన అక్కడికి వచ్చారు. పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలకు (Rescue Operation) అవసరమైన పరికరాలన్నీ ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జియోమ్యాపింగ్ టీమ్‌తో పాటు డ్రిల్లింగ్ మెషీన్‌లు (Uttarakhand Drilling Machine) ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
"వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టం. ఏదో ఒకటి చేసి కాపాడతాం. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కిఅవసరమైన సామగ్రి అంతా అందుబాటులోనే ఉంది. ఒక ఆప్షన్ ఫెయిల్ అయితే మరో ఆప్షన్ ఆలోచిస్తాం. మాకు కావాల్సిందల్లా కో ఆర్డినేట్ చేసే టీమ్. నిలువుగా డ్రిల్లింగ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నాం. ఇది చివరి ఆప్షన్‌గా పెట్టుకుంటున్నాం. విదేశాలకు చెందిన నిపుణులు కూడా మాకు అవసరమైన సాయం చేస్తున్నారు."
- రెస్క్యూ ఆపరేషన్ అధికారులు
మానసిక ఆందోళన..
ప్రస్తుతానికి ఆ 40 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగా (Uttarakhand Tunnel Collapse) ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్లు సురక్షితంగా బయటకు వస్తారా లేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్, నార్వే నుంచి రెండు రెస్క్యూ టీమ్స్ వచ్చాయి. ఇప్పటి వరకూ కొండ చరియలను 30 మీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేసి భారీ పైప్‌లు (Uttarakhand Tunnel Rescue Opearation) జొప్పించారు. వాటి ద్వారానే ఆహారం, ఆక్సిజన్ అందిస్తున్నారు. మొత్తం 5 పైప్‌లు అమర్చి కొంత వరకూ వాళ్లను సురక్షితంగా ఉంచగలుగుతున్నారు. అటు వైద్యులు మాత్రం వీలైనంత త్వరగా వాళ్లను బయటకు తీసుకురావాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఫిజికల్‌గానే కాకుండా మానసికంగా కూడా వాళ్లు కుంగిపోయే అవకాశముందని అంటున్నారు. శిథిలాలు మీద పడే ప్రమాదం ఉండడం వల్ల ప్రాణాలు కాపాడడం కాస్త సవాలుతో కూడిన పనే అంటున్నారు వైద్యులు.